కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడంటున్న కేఏ పాల్

Update: 2023-02-13 20:33 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పెద్ద వివాదంగా మారింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసింది. ఇక తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ సర్కార్ చేసిన ఫోన్ ట్యాపింగ్ గురించి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే కొద్దోగొప్ప ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం సర్వసాధారణం. అయితే తెలుగు రాజకీయాల్లో అసలు బలం బలగం లేని కేఏ పాల్ ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారట.. ఆయననే ఈ ఆరోపణలు చేయడం విశేషం.

ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల నుండి ప్రముఖమైన ఆరోపణగా మారింది. తాజాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వైసీపీ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు, తెలంగాణ రాజకీయ దృష్టాంతంలో ఏదో ఫోన్ ట్యాపింగ్ థ్రెడ్‌ను బయటకు తీశాడు కేఏ పాల్.

తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. “కేసీఆర్ నా మొబైల్‌ను ట్యాప్ చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కేంద్ర మంత్రులు, కోర్టు జడ్జిలతో నా సంభాషణలు వినేందుకు ఆయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అమిత్ షాతో నేనేం మాట్లాడానో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటున్నారు. కానీ నేను దాని గురించి పట్టించుకోను, ”కేఏ పాల్ అన్నాడు.

తెలంగాణ జనాభాలో 70% పైగా ప్రజలు తనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత అన్నారు. ‘‘కేసీఆర్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదు. మా పాలన ప్రారంభం కానుంది. భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణను సృష్టిస్తాను’’ అని కేఏ పాల్ ఏకంగా తన ప్రభుత్వం వస్తుందన్న ధీమాను వ్యక్తం చేయడం విశేషం. ఎంతైనా పాల్ మాటలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆయన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని.. తనను తాను ఓ ప్రధాని స్థాయి నేతగా ఊహించుకోవడం ఆయనే చెల్లిందని సెటైర్లు పడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News