ఏపీలో ప్రస్తుతం ఓ వైపు లోకల్ వార్ కాకరేపుతుంటే మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎన్నో పోరాటాలు, 32 మంది ప్రాణత్యాగాల తర్వాత సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ ఉక్కు ఉద్యమంలోకి క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంటరయ్యారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు కేఏ పాల్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పాల్ పిటిషన్ లో వెల్లడించారు. క్యాపిటల్ మైనింగ్ అంశంలో ఉక్కు ఫ్యాక్టరీకి లీజు అనుమతులు వచ్చేలా చూడాలని తన పిటీషన్ లో విజ్ఞప్తి చేశారు కేఏ పాల్. సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖ అంశాన్ని కూడా తన పిటిషన్‌లో ప్రస్తావించారు కేఏ పాల్. ప్రభుత్వం అనుమతి ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విరాళాలు సేకరిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర మైనింగ్ శాఖ, ఆర్థిక శాఖ, విశాఖ స్టీల్ ప్లాంట్, కేంద్ర స్టీల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను కేఏ పాల్ చేర్చారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేఏ పాల్ తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కనిపించని కేఏ పాల్.. అమెరికాలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన వ్యవహారాలపై రియార్ట్ అవుతున్నారు. ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం పై మరోసారి ఏపీ రాజకీయాల్లోకి కేఏ పాల్ రీ ఎంట్రీ ఇచ్చారు.