ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలనే కృతనిశ్చయంతో టీడీపీ ఉంది. ఓవైపు నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 16 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేత జయమంగళ వెంకట రమణను వైసీపీలో చేర్చుకుని దెబ్బకొట్టింది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది. జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరడంతో కైకలూరులో టీడీపీకి ఇంచార్జి లేకుండా పోయారు. దీంతో అభ్యర్థి ఎంపికపై టీడీపీ దృష్టి సారించింది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నమనేని వెంకటేశ్వరరావు కైకలూరు నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పిన్నమనేని వెంకటేశ్వరరావు గతంలో ముదినేపల్లి నుంచి 1989, 1999, 2004ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, కీలకమైన ఆంధప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) చైర్మన్ గానూ పిన్నమనేని వెంకటేశ్వరరావు పనిచేశారు.
1994లో టీడీపీ అభ్యర్థి చేతిలో పిన్నమనేని వెంకటేశ్వరరావు ఓడిపోయారు. వెంకటేశ్వరరావుకు ముందు ఆయన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు 1978, 1983ల్లో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ముదినేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేసిన 1983 ఎన్నికల్లోనూ ఆయన సొంత జిల్లాలోని స్థానమైన ముదినేపల్లిలో టీడీపీ ఓడిపోయింది.
విలక్షణ రాజకీయ నేతగా గుర్తింపు పొందిన పిన్నమనేని కోటేశ్వరరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయన మృతి చెందాక ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు రంగప్రవేశం చేశారు. 1989, 1999, 2004ల్లో ముదినేపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు 2009లో నియోజకవర్గం లేకుండా పోయింది. నియోజకవర్గాల పునర్విభజనలో ముదినేపల్లి రద్దయింది.
నియోజకవర్గాల పునర్విభజనలో ముదినేపల్లి రద్ద ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలు గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో కలిశాయి. పిన్నమనేని సొంత మండలమైన నందివాడ.. గుడివాడ నియోజకవర్గంలో చేరింది. ఇక ముదినేపల్లి మండలాన్ని కైకలూరు నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న పిన్నమనేని వెంకటేశ్వరరావు కైకలూరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు పిన్నమనేని వెంకటేశ్వరరావు పెదనాన్న మనవడు పిన్నమనేని బాబ్జీ కూడా గుడివాడ నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు పిన్నమనేని కుటుంబం సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉండటంతో ఇటు కృష్ణా జిల్లా అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీ బలగం, అనుచరులు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిన్నమనేని వెంకటేశ్వరరావుకు కైకలూరు సీటు ఇవ్వాలని చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.