వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ.. సంచ‌ల‌నం రేపిన ఘ‌ట‌న‌.. ఏం జ‌రిగింది

Update: 2022-05-20 16:31 GMT
వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అదికూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిదే కావడంతో మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. గురువారం స్వ‌యంగా ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ గురువారం ఉదయం.. కారులో తనతోపాటు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్‌ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా.. ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా.. మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతుని బంధువులు తెలిపారు. దీంతో.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

Tags:    

Similar News