ఉత్తరాంధ్రా రాజకీయాలు కులపరంగా చీలి ఉంటాయి. నాయకుల మధ్యన పోరు కూడా అలాగే ఉంటుంది. పదవుల పంపిణీ విషయం తీసుకున్నా అధినాయకత్వం ఆయా కులాల నుంచి గట్టి నాయకులను తీసుకుని వారికి అవకశాలు ఇచ్చి బాలన్స్ చేస్తూ ఉంటుంది. అలా కనుక చూసుకుంటే దివంగత ఎర్రన్నాయుడు కాలం నుంచి వెలమలకు ఒక పదవి, కాపుల నుంచి కళా వెంకటరావు వంటి వారికి మరో పదవి ఇస్తూ తెలుగుదేశం తనదైన శైలిలో మ్యానేజ్ చేస్తోంది.
నిజానికి కళా వెంకటరావు 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి వెనక్కి వచ్చినా ఆయన్ని తెచ్చి విభజన ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ ని చంద్రబాబు చేశారు. ఆ మీదట మంత్రిగా అవకాశం ఇచ్చారు. 2014, 2019లలో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా చాన్స్ ఇచ్చారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు ఎంత పట్టు ఉందో కళాకు కూడా అంతే ఉంది.
ఆ విధంగా ఇద్దరు సీనియర్ నేతలూ ఉన్నారు. ఇక ఇద్దరు మధ్యన విభేదాలు ఉన్నాయి. దాని వల్ల పార్టీ ఇబ్బంది పడుతోంది. అచ్చెన్నకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన దగ్గర నుంచి కళా వర్గం గుర్రుగానే ఉంది. ఇలా ఆధిపత్య పోరు సాగుతున్న నేపధ్యంలో తెలుగుదేశం అధినాయకత్వం కళా మీద ఫోకస్ పెట్టింది. ఆయనకు కీలకమైన బాధ్యతలను అప్పగించింది.
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా వెంకట్రావు ఉత్తరాంధ్రా టీడీపీ బాధ్యతలను చూసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రా జిల్లాలలో తూర్పు కాపులు ఎక్కువగా ఉంటారు. మెజారిటీ నియోజకవర్గాలలో వారిదే హవా. అందువల్ల వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ ని దెబ్బ తీసేందుకు కళాను రంగంలోకి దించాలని చంద్రబాబు మాస్టర్ మైండ్ ని ఉపయోగించారని అంటున్నారు.
అదే టైం లో అచ్చెన్నాయుడుకు పోటీగా కళాను దించడం వెనక ఎవరి పాత్ర ఉంది అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అచ్చెన్నాయుడుకు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ అని అంటున్నారు. ఇపుడు కళాను ఉత్తరాంధ్రా లెవెల్ లో ప్రమోట్ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా పార్టీలో ప్రత్యేకించి ఆయన వర్గంలో ఉంది.
ఇక ఈ నెల 25న చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సుని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు బాధ్యతలను కూడా కళా చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఈ సదస్సుకు వస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్రాలో పార్టీ పరిస్థితి మీద పూర్తి నివేదికను కూడా తయారు చేసి కళా సమర్పిస్తారని అంటున్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాలలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారని అంటున్నారు. అలా కనుక చేస్తే తెలుగుదేశం అధికారంలోకి రావడంతోనే సముచితమైన గౌరవాన్ని ఆయనకు చంద్రబాబు ఇస్తారని కూడా హామీ దొర్కిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీలో అమాంతం కళా వైభవం పెరిగింది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.