కొంతమంది అంతే. వారు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అలాంటి వాళ్లలో ఈ కమాల్.ఆర్.ఖాన్ ఒకడు. అప్పుడెప్పుడో 'ఏక్ విలన్' సినిమాలో ఒక్క చిన్న క్యారెక్టర్ లో కనిపించిన ఈ కమాల్ బాబు.. అంతకముందు ఏం సినిమాలు తీశాడో తెలియదు. కాకపోతే కొన్ని సినిమాల్లో ఇన్వెస్టుమెంట్లు పెట్టాడట. దానికి తోడు పేరు చివరను ఖాన్ అనే తోక ఉండటంతో.. అక్కడక్కడా పార్టీల్లో కనిపించినప్పుడు సల్మాన్ ఖాన్ వంటి హీరోలు కాస్త నెత్తిన ఎక్కించుకున్నారు. దానితో మనోడు నోటికి తాళం వేయకుండా ఇష్టమొచ్చినట్లు మాట్టాడేస్తూ ఉంటాడు.
ఇప్పటివరకు కమాల్ ఆర్ ఖాన్ ను తిట్టని హీరోహీరోయిన్లు లేరు. మొన్ననే ఆలియా భట్ బికినీల్లో పోజులిస్తే.. బికినీ వేసుకున్నా కూడా చెడ్డీ వేసుకున్న చిన్నపిల్లలా ఉంది అంటూ కామెంట్లు చేశాడు ఈ కమాల్. బాలీవుడ్ అంతా పిచ్చోడిగా పిలిపించుకుంటున్న ఈ కమాల్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద జోకులేస్తే తెలుగులో కూడా పాపులర్ అయిపోయాడు. అయితే అతడు ఇక్కడ కూడా స్టారయ్యాడు అనేది ఒక భ్రమే. ఎందుకంటే బాలీవుడ్ లో కేవలం అభిమానుల రియాక్షన్ ఫేసుబుక్కుకే పరిమితం అవుతుంది. కాని టాలీవుడ్ లో అలా కాదు. ఒకానొక సమయంలో ఒక టాప్ హీరోను ఒక మాటన్నందుకు రైల్వే స్టేషన్ లో రాళ్ళు పెట్టి కొట్టిన సీన్లు గుర్తున్నాయిగా.. పాపం ఈ కమాల్ ఖాన్ ఇప్పుడు పొరపాటను అలా మనోళ్ళకు ఏ హైదరాబాద్ లోనో దొరికాడు అనుకోండి.. ఏంటి పరిస్థితి?
ఈ పిచ్చోడి మొహం పెద్దగా ఎవ్వరూ గుర్తుపట్టరు కాబట్టి.. పర్లేదులే. కాని అభిమానులు సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఆ సీన్ వేరేలా ఉంటుంది. అనవసరంగా టాలీవుడ్ జోలికి వస్తున్నావ్ కమాల్.. తోడా సంబాల్ కే రఖో!!