కమల్ హాసన్ పోటీ అక్కడి నుంచేనట?

Update: 2020-09-04 04:30 GMT
తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడైన ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా తాను పోటీచేసే నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఆయన ‘చెన్నై థౌజెండ్ లైట్స్’ నియోజకవర్గంలో పోటీచేసేందుకు సిద్దమవుతున్నారని తెలిసింది.

గత లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పరమక్కుడిలో పోటీచేయాలనుకున్నారు. చివరి క్షణంలో విరమించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కమల్ హాసన్ ప్రస్తుతం మైలాపూర్ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. కానీ ఆయన చెన్నై థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో పోటీచేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారట..వీఐపీలు ఇక్కడి నుంచి గతంలో పోటీచేశారు.

ఇప్పటికే పవన్ ఇక్కడ ముందస్తు పనులను పార్టీ ప్రముఖులు , నాజర్ సతీమణీ కమీలా నాజర్ కు అప్పగించారు. ఇక ఇది కాకుంటే టీనగర్ నుంచి పోటీచేయాలని కమల్ భావిస్తున్నారట.. ప్రత్యామ్మాయంగా దాన్ని ఉంచుతున్నారు.

ఇక డీఎంకే నుంచి డీఎంకే అధ్యక్షుడి కుమారుడు ఉదయనిధి చెన్నై థౌజండ్ లైట్స్ నుంచే పోటీచేస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ పోటీచేయడానికి అదీ కారణంగా భావిస్తున్నారు. వీరిద్దరి పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News