నువ్వా నేనా అన్నట్లు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట్నించి అనుకున్నట్లే డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని సాధించారు. ఆరు సీట్లు వస్తే చాలు అధ్యక్షుడు అవుతారన్న లెక్కలకు భిన్నంగా అవసరమైన మేజిక్ ఫిగర్ కు మించే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సొంతం చేసుకున్నారు. గెలుపు కన్ఫర్మ్ అయిన వెంటనే.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న మనమ్మాయి కమలా హ్యారీస్ తమ విజయానందాన్ని బైడెన్ తో పంచుకున్నారు.
పచ్చని పార్కులో.. ట్రాక్ షూట్ లో ఉన్న ఆమె.. బైడెన్ తో ఫోన్ లో మాట్లాడిన చిట్టి వీడియోలో.. ‘జో.. మనం సాధించాం. మీరు తదుపరి అధ్యక్షుడు అవుతున్నారు’ అంటూ ఎగ్జైటింగ్ తో కూడిన విజయానందం ఆమె మాటల్లో వినిపించింది. గెలిచామన్న తర్వాత ఆమె ఎంత ఆనందంగా ఉన్నారన్న విషయం.. ఆమె మాటల్లోనూ.. నవ్వులోనూ స్పష్టంగా వినిపించింది.
గెలుపు లెక్క తేలిపోయిన వెంటనే ఆమె ఒక వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందన్న ఆమె.. ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్ అంటూ ట్రంప్ కు కాలిపోయేలా చిట్టి వీడియో ఒకటి పోస్టు చేశారు. భారత సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన ఆమె గెలుపు భారతీయుల్లో విపరీతమైన ఆనందాన్ని మిగిల్చింది.
Full View
Full View Full View