అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం.. అప్పుడప్పుడు రాజకీయ నేతలు వారిని దర్శించుకోవటం.. ఈ సందర్భంగా ఫోటోలతో వార్తల్లో కనిపించే పీఠాధిపతులు.. తాజాగా అందుకు భిన్నమైన రీతిలో వార్తల్లోకి వచ్చారు. ఏపీలోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు.. పెరుగుతున్న అన్యమత ప్రచారంపై పలువురు పీఠాధిపతులు.. ఉత్తరాధికారులు కలిసి ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని పొన్పాడి గ్రామం శివారులో కంచిపీఠానికి చెందిన ఒక ఆశ్రమంలో రాత్రి వేళ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రైవేటు సమావేశానికి సంబంధించిన వివరాల్ని భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి స్వామి మీడియాకు వెల్లడించటంతో.. ఈ భేటీ వివరాలు బయటకు వచ్చాయి.
కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలు ధ్వంసం చేయటాన్ని సదస్సు తీవ్రంగా పరిగణించిందని.. నిబంధనలకు విరుద్ధంగా అన్యమత ప్రచారం జరగటాన్ని తప్పుపట్టినట్లుగా పేర్కొన్నారు. రామతీర్థంలో రాముడి తల ధ్వంసం చేయటం స్వామీజీలకు ఆవేదన కలిగించిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా అన్యమత ప్రచారం.. మైనార్టీల మెప్పు కోసం హిందూ ఆలయాల ఆదాయాన్ని వినియోగించటాన్ని సదస్సు తప్పు పట్టింది.
తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నాయన్న ఆవేదనను.. ఆగ్రహాన్ని పుష్పగిరి పీఠాధిపతి వ్యక్తం చేసినట్లుగా చెప్పారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న అంశం చర్చకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. మాజీ న్యాయమూర్తులు.. నిపుణుల ద్వారా ఆలయాల నగల్ని.. ఆస్తుల్ని కాపాడుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న సూచన కూడా భేటీలో వచ్చినట్లుగా వెల్లడించారు. తమది రహస్య సమావేశం కాదని చెప్పినా.. అదే నిజమైతే.. ముందుగా ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వనట్లు? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
ఇక.. సమావేశానికి పెద్ద ఎత్తున స్వామీజీలు హాజరయ్యారు. వారిలో ముఖ్యులు ఎవరంటే..
కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి
దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్
హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి
పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి
తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి
అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి
ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం
కంచి మఠం ప్రతినిధి చల్లా విశ్వనాథ శాస్త్రి తదితరులు