కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి. కోమటిరెడ్డి విషయాన్ని టీఆర్ ఎస్ స్పెషల్ కేస్ గా తీసుకుందన్న మాట వినిపిస్తున్న వేళ.. ఆయనపై తాజాగా చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
కోమటిరెడ్డి విద్యార్హతపై భూపాల్ రెడ్డి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కోమటిరెడ్డి ఒక శంకర్ దాదా అని.. ఆయన తన విద్యార్హత మీద తప్పుడు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. 18 సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయిన కోమటిరెడ్డి తన విద్యార్హత విషయాన్ని బీఈగా పేర్కొన్నారన్నారు.
దీనికి సంబంధించిన కేసు ఇప్పటికే హైకోర్టులో ఉందని.. త్వరలో తీర్పు రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే సభ నుంచి అనర్హత వేటు పడిన కోమటిరెడ్డిపై త్వరలో హైకోర్టు తీర్పుతో అనర్హత పడటం ఖాయమని ఆయన చెబుతున్నారు. తన విద్యార్హతను తప్పుగా చెప్పటం ద్వారా ప్రజల్ని మోసం చేశారని భూపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి.. ఆయన ఆరోపణల్లో నిజం ఎంతన్నది హైకోర్టు తీర్పు స్పష్టం చే్స్తుందని చెప్పాలి. మరి.. తన విద్యార్హతపై వస్తున్న ఆరోపణలపై కోమటిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.