కంగనా వల్ల మహా కూటమిలో విభేదాలు?

Update: 2020-09-12 04:15 GMT
బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ను మహారాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయడంను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి నచ్చడం లేదు. చిన్న విషయాన్ని మరీ పెద్దదిగా ఉద్దవ్‌ ఠాక్రే చేశారంటూ ఎన్సీపీ అధినేత శరత్‌ పవార్‌ అంటున్నారట. ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ కూల్చి వేసిన తన ఆఫీస్‌ ఎన్సీపీ అధినేత శరత్‌ పవార్‌ దే అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు మరింతగా దుమారం రేపుతున్నాయి. శరత్‌ పవార్‌ కు చెందినది అని తెలిసే మహా ప్రభుత్వం కూల్చి వేతకు సిద్దం అయ్యిందా లేదంటే కంగనాపై కక్షతో చేసిందా అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో కంగనా అంటున్నట్లుగా ఆ భవనంతో తనకు సంబంధం లేదు అంటూ స్వయంగా శరత్‌ పవార్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇదే సమయంలో సీఎం ఉద్దవ్‌ ఠాక్రేతో శరత్‌ పవార్‌ భేటీ అయ్యారని కంగనా విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఠాక్రే వ్యవహరించిన తీరుపై పవార్‌ అసహనం వ్యక్తం చేశాడని చిన్న విషయంలో ఇన్వాల్వ్‌ అవ్వడంతో అది కాస్త పెద్ద సమస్యగా మారిందంటూ పవార్‌ అన్నాడట. రాజకీయ చతురతతో వ్యవహరించకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నట్లయ్యిందని పవార్‌ సీఎంతో అన్నారట.

మొత్తానికి కంగనా విషయంతో మహారాష్ట్ర కూటమిలో విభేదాలు తలెత్తేలా ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్సీపీ మరియు కాంగ్రెస్‌ పార్టీల మద్దతుతో ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ వివాదం మరింత ముదిరితే ఆ రెండు పార్టీల్లో ఏ ఒక్కటి తప్పుకున్నా కూడా ప్రభుత్వం కూలి పోయే ప్రమాదం ఉందని జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం బీజేపీ తెర వెనుక ఉండి నడిపిస్తుందనే అనుమానాలు కూడా శివసేన వ్యక్తం చేస్తోంది.
Tags:    

Similar News