కంగనా శివసేనకు ఓటేయలేదన్న జర్నలిస్ట్.. ట్వీట్స్ డిలీట్ చేసిన కంగనా టీమ్...!

Update: 2020-09-20 08:10 GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కంగనా వెల్లడిస్తున్న సంచలన విషయాలతో కంగనా vs బాలీవుడ్ ఇండస్ట్రీ అని స్టార్ట్ అయిన వార్ లో.. రోజులు గడుస్తున్న కొద్దీ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కంగనా vs మహారాష్ట్ర ప్రభుత్వం(శివసేన).. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం అనే విధంగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ విధించాలని.. కరోనా నుండి ప్రజలను రక్షించగలిగే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోందని పేర్కొంది. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ 'నేను మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి బదులు శివసేనకి ఓటు వేశాను. ఇష్టం లేకున్నా నేను నా కుటుంబ సభ్యులు శివసేనకు ఓటేశాం. బలవంతంగా నాతో శివసేనకు ఓటేయించారు' అని పేర్కొంది.

అయితే దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ కమలేష్ సుతార్ స్పందిస్తూ.. ''కంగనాకి బాంద్రా వెస్ట్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది . 2019 ఎన్నికల్లో బీజేపీ - శివ సేన కలిసి పోటీ చేశాయి. ఆమెకి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో అటు అసెంబ్లీ ఇటు లోక్ సభకి బీజేపీ అభ్యర్థులే నిలబడ్డారు. అక్కడ శివసేన కాండిడేట్స్ పోటీలో లేరు. మరి ఆమె ఎవరికీ ఓటు వేసింది'' అని ప్రశ్నించాడు. దీనికి రియాక్ట్ అయిన కంగనా ట్విట్టర్ వేదికగా కమలేష్ సుతార్ పై ఫైర్ అయింది. 'నువ్వు ఒక ట్రోల్.. నీ సంగతి చూస్తా' అంటూ బెదిరించే ధోరణిలో ట్వీట్ చేసింది. అయితే సదరు జర్నలిస్ట్ కూడా కంగనా ట్వీట్ కి గట్టిగా సమాధానం ఇచ్చాడు. 'నేను ఒక జర్నలిస్ట్ ని.. ఒక అనామక ట్రోల్ ని కాదు. నీ బెదిరింపులకు భయపడను' అని పేర్కొన్నాడు. ఐతే కంగనా తాను చేసిన పలు ట్వీట్ డిలీట్ చేసి.. కమలేష్ ని బ్లాక్ చేసింది.

కంగనా కొన్ని ట్వీట్స్ డిలీట్ చేసిన తర్వాత "హైనాస్ గుంపు ఆల్రెడీ లాలాజల వదులుతున్నాయి. నేను నా కుటుంబం మరియు సిబ్బందితో కలిసి ఓటు వేశాను. మేము అయిష్టంగానే శివసేనకు ఓటు వేయవలసి వచ్చిందని వారందరూ నాతో అంగీకరిస్తున్నారు. వివరాలు తెలుసుకోవడంలో కొంత గందరగోళం అని అనుకుందాం.. కానీ అది నన్ను అబద్ధాలకోరుగా చేయలేదు. రాబందులు ఎటువంటి కారణం లేకుండా ఉత్సాహంగా ఉన్నాయి'' అని మరో ట్వీట్ చేసింది. ఇక జర్నలిస్ట్ కమలేష్ సుతార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'కంగనా తన బెదిరింపు ట్వీట్స్ డిలీట్ చేసింది. నన్ను బ్లాక్ చేసింది. నేను మాత్రం నా స్టోరీకి కట్టుబడి ఉన్నాను' అని పేర్కొన్నాడు. ఈ ఇష్యూ తర్వాత చాలామంది కంగనా అడ్డంగా దొరికిందని.. ముందుగా చేసిన ట్వీట్స్ తొలగించి మళ్ళీ ట్వీట్ చేసి తద్వారా దృష్టిని మళ్లించడానికి ట్రై చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News