ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల బీజేపీకి రాజీనామా సమర్పించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ''జగన్.. గతంలో నువ్వేమన్నావో నీకు గుర్తుందా?'' అని ప్రశ్నించారు. ఈ నెల 23వ తారీకున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతున్నట్టు కన్నా తెలిపారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ కండువా మార్చుకోనున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా జగన్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు.. కథనాలపై కన్నా తీవ్రస్థాయిలో స్పందిం చారు. '' జగన్ మీడియా నాపై అసత్య ఆరోపణలు చేస్తోంది. ఇంకా చేయటానికి సిద్ధంగా ఉంది.
అయినా.. వాటిని నేను లెక్కచేయను. కానీ, జగన్ గతంలో చేసిన తన మాటలను ఒక్కసారి తిరిగి ఆలోచించుకోవా లి. జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే అరాచకపాలన మొదలు పెట్టారు'' అని కన్నా మండిపడ్డా రు.
అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించా రు. అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి, పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని.. వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తుందా అని ప్రశ్నించారు. ''జగన్ అధికారం శాశ్వతం కాదు. ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడు ఉండరు'' అని కన్నా హెచ్చరించారు
టీడీపీ నేత, గన్నవరం వివాదం నేపథ్యంలో పోలీసులు తీసుకువెళ్లిన పట్టాభిని ఎక్కడ దాచారో తెలపాల ని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా మని అన్నారు.
రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారని, పోలీసులే పట్టించుకోకపోతే ఎవరిదగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. డీజీపీ తక్షణమే పోలీసుల అరాచకాలకు స్వస్తిపాలకాలని కన్నా సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.