కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును బీజేపీ తరఫున కర్ణాటక నుంచి రాజ్యసభకుని పంపే విషయంలో వివాదం సద్దుమణగడం లేదు. రాష్ట్రం నుంచి వెంకయ్యను పంపే బదులు కన్నడిగునికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదికె కార్యకర్తలు నిరసనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేసిన సదరు వేదిక నాయకులు తాజాగా భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
కర్ణాటక నుంచి మూడుమార్లు వెంకయ్యను ఎంపిక చేసి పెద్దల సభకు పంపినా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ విమర్శించారు. మరోమారు వెంకయ్య నాయుడుకు అవకాశం ఇచ్చే బదులు కన్నడిగునికి పంపించే విషయంలో భాజపా నాయకులు నిర్ణయం తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యకు ఇతర రాష్ట్రాల నుంచి ఎంపిక చేసుకునేలా భాజపా నాయకత్వాన్ని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనకారులు పార్టీ కార్యాలయంలోకి చొరబడకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.