మే మొదటి వారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన లింగాయత్ ల పైన కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కర్ణాటకలో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 100 చోట్ల లింగాయత్ లు అభ్యర్థుల జయాపజయాలను శాసించగల స్థితిలో ఉన్నారు. లింగాయతుల మద్దతు ఎవరికి దక్కితే వారు అధికారంలోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో 17 శాతం ఉన్న లింగాయతుల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 57 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న మొత్తం 57 మంది లింగాయత్ ఎమ్మెల్యేల్లో 34 మంది అధికార బీజేపీ తరఫునే ఉన్నారు.
లింగాయత్ లు మొత్తం యడ్యూరప్పను తమ ఆరాధ్య నాయకుడిగా భావిస్తూ వస్తున్నారు. యడ్యూరప్ప బీజేపీలో ఉండటంతో లింగాయత్ సామాజికవర్గం బీజేపీకి పెట్టనికోటలా ఉంది. అయితే యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం, లింగాయత్ సామాజికవర్గానికే చెందిన మాజీ సీఎం జగదీష్ శెట్టార్ కు ఈసారి అసెంబ్లీ సీటు ఇవ్వకపోవడం, అలాగే మరో లింగాయత్ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవాదికి సీటు ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈసారి లింగాయత్ లు బీజేపీ పైన ఆగ్రహంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై లింగాయత్ అయినప్పటికీ ఆ సామాజికవర్గంలో ఆయనకు అంత పట్టులేదని అంటున్నారు.
అయితే బీజేపీ లింగాయతులను నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరోసారి భారం మొత్తం బీజేపీ కురువృద్ధుడు యడ్యూరప్ప పైనే భారం మోపింది. మరోవైపు లింగాయత్ ల మఠాలు కర్ణాటకలో ఎక్కువ. ఈ పీఠాధిపతులు కూడా యడ్యూరప్పను అభిమానిస్తారు. యడ్యూరప్పను బీజేపీ సీఎంగా తప్పించడంతో వారంతా బీజేపీపైన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.
ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో బీజేపీ అత్యధికంగా లింగాయత్ లకే సీట్లను కట్టబెట్టింది. అంతేకాకుండా కర్ణాటకలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను వారికి తీసివేసింది. లింగాయతులకు రెండు శాతం, ఒక్కలిగలకు 2 శాతం చొప్పున పంచింది.
ఈసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న కాంగ్రెస్ కూడా లింగాయతులపై ఆశలు పెట్టుకుంది. బీజేపీకి చెందిన మాజీ సీఎం జగదీష్ శెట్టార్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటివారికి సీట్లు కేటాయించింది. ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో 43 సీట్లను లింగాయతులకే కాంగ్రెస్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో లింగాయతులు ఈసారి ఎటు మొగ్గుతారో వేచిచూడాల్సిందే!