కర్ణాటక రాజకీయం కొలిక్కి వచ్చిందని.. ముఖ్యమంత్రి పదవిలో సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఖరారు చేసినట్లుగా జరుగుతున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసింది కాంగ్రెస్. గడిచిన నాలుగు రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై భారీ ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ణాటకకు ముఖ్యమంత్రి విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం తేల్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా మొదలు కొని స్థానిక మీడియా వరకు సీఎం పదవికి సిద్దరామయ్యకు ఎంపిక చేశారన్న వార్తలు రావటం.. దీనికి తగ్గట్లే సిద్దూ వర్గీయులు సంబరాలు చేసుకోవటం తెలిసిందే.
సిద్దరామయ్య ఇంటి వద్ద భద్రత పెంచిన వైనంతో ఆయనే తదుపరి సీఎం అన్న ప్రచారం సాగింది. ఇలాంటి వేళ సీన్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ పార్టీ పరిశీలకుడు రణ్ దీప్ సూర్జేవాలా.
ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ ఇప్పటివరకు ఎవరిని ఫైనల్ చేయలేదని.. బయట జరుగుతున్న ప్రచారం మొత్తం తప్పని తేల్చారు. తుది నిర్ణయం తీసుకోవటానికి మరింత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో చర్చలు జరుగుతున్నాయని.. నేడో.. రేపో నిర్ణయం తీసుకునే వీులందన్నారు.
"మరో 48 గంటల నుంచి 72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేస్తామని.. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మీద కూడా తప్పుడు ప్రచారం జరుగుతుందని తేల్చేశారు.
జరుగుతున్న ప్రచారమంతా ఫేక్ అని తేల్చేసిన ఆయన.. విషయాన్ని మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ప్రకారం.. ముఖ్యమంత్రిగా సిద్దూను.. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది.
ఒప్పందంలో భాగంగా మొదటి రెండేళ్లు సిద్దూకు.. మిగిలిన మూడేళ్లు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవిని చేపడతారని చెప్పినా.. సూర్జేవాల్ ప్రకటనతో అవన్నీ తప్పుగా తేలిపోయాయి. మళ్లీ అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.