రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు నరేంద్రమోడీ ఇమేజి, హిందుత్వ అజెండాను మాత్రమే నమ్ముకుంటే కష్టమేనట. ఈ విషయాన్ని ఎవరో చెప్పటంకాదు పార్టీని నడిపించటంలో దిక్సూచిగా పనిచేసే ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఆర్గనైజర్ స్వయంగా ప్రకటించింది.
ఆర్గనైజర్ లో కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై సుదీర్ఘమైన విశ్లేషణ వచ్చింది. కర్నాటకలో గెలుపుకు అందరు మోడీ ఇమేజి మాత్రమే ఆధారపడినట్లు ఆరోపించింది. పరిపాలన సవ్యంగా చేయకుండా అవినీతి, అక్రమాలతో నింపేస్తే ఉపయోగం ఏముంటుందని నిలదీసింది.
జనరంజకమైన పాలన, సంక్షేమపథకాలను సమర్ధవంతంగా అమలుచేయాలన్నది. వీటికి సమర్ధవంతమైన స్ధానిక నాయకత్వం చాలా అవసరమని చెప్పింది. లోకల్ నేతలు కష్టపడకుండా అంతా మోడీనే చూసుకుంటారని అనుకుంటే ప్రతిఎన్నికలోను కర్నాటక ఫలితమే రిపీట్ అవుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. కర్నాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రితో పాటు స్ధానికంగా ఉన్న నేతల్లో ఎవరూ జనాలపై సరైన ప్రభావం చూపలేకపోయినట్లు మండిపడింది.
ప్రతిరాష్ట్రంలోను మోడీయే ప్రచారంచేసి గెలిపించాలంటే సాధ్యమవుతుందా అని నిలదీసింది. ప్రభుత్వంలో పారదర్శకత, నేతల్లో ఐకమత్యం లేనపుడు ఫలితాలు ఇలాగే ఉంటాయని మండిపడింది. మోడీ ఇమేజి, హిందుత్వ అజెండా ప్రతిసారి పార్టీని ఎన్నికల్లో గట్టెకించలేవన్న విషయాన్ని అందరు తెలుసుకోవాలని చెప్పింది.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ అవుతాయని చెప్పేందుకు లేదని కూడా అన్నది. రాజకీయ పరిస్ధితుల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని గుర్తుచేసింది.
కాకపోతే కర్నాటక ఫలితాలు ప్రతిపక్షాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ లో కొత్త ఊపును తెచ్చిందన్న వాస్తవాన్ని బీజేపే అగ్రనేతలు అంగీకరించాలన్నది. కర్నాటక విజయంతోనే ప్రతిపక్షాలు రెట్టించిన ఉత్సవాహంతో బీజేపీ వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పింది. ప్రతిపక్షాలు ఏకతాటి పైకి వచ్చి కూటమి కట్టడం అంత వీజీ కాదని అయితే ప్రయత్నాలు మాత్రం జోరుగా జరుగుతున్నట్లు చెప్పింది.
కాబట్టి ప్రతి రాష్ట్రంలోను స్ధానిక నాయకత్వాన్ని బలోపేతం చేయటంపైన ముందు దృష్టిపెట్టాలని సూచించింది. అధికారంలో ఉన్నపుడు ప్రజలకు కావాల్సిందేమిటో తెలుసుకుని పారదర్శకంగా అందించాలని సలహా ఇచ్చింది. మరి ఆర్గనైజర్ సూచన, సలహాను బీజేపీ పట్టించుకుంటుందా ?