మద్యం డోర్ డెలివరీ..మంత్రి ఆఫర్ పై దుమారం

Update: 2019-09-05 10:35 GMT
కర్ణాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. జనం  వరదలతో అస్తవ్యస్తమవుతున్నారు. పంటలు మునిగి ఆహాకారాలు చేస్తున్నారు. గత కుమారస్వామి ప్రభుత్వమే ఆదుకోలేదని మంటగా ఉన్న వేళ.. బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతో సీఎం యడ్యూరప్ప తలపట్టుకుంటున్నారు.

తాజాగా వరదలతో అల్లాడుతున్న కన్నడ ప్రజలకు తిండి - బట్ట - ఆశ్రయం అందించాల్సిన ఓ మంత్రివర్యులు అవన్నీ పక్కనపెట్టేసి ఏకంగా ప్రజలకు మద్యాన్ని డోర్ డెలవరీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమైంది. కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి నగేష్ చేసిన ప్రకటన కన్నడ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.

కేబినెట్ లోని ఇతర మంత్రులు దీనిపై సీఎం యడ్యూరప్పను నిలదీశారు. దీంతో ఆయన మంత్రి నగేష్ ను పిలిపించి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని.. అంతా మీ ఇష్టమేనా అని సీఎం యడ్డీ మంత్రిని నిలదీసినట్టు సమాచారం. మీడియాకు ఎందుకు ఈ విషయం చెప్పారంటూ ఫైర్ అయ్యారట..

ప్రస్తుతం వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ‘మద్యం డోర్ డెలవరీ ’ అంశం కన్నడ నాట ప్రతిపక్షాలకు ఆయుధమైంది. దీనిపై వారు రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. మంత్రి నగేష్ చేసిన వ్యాఖ్యల కలకలం కొనసాగుతోంది.
Tags:    

Similar News