గాడిదపై మాజీ ఎమ్మెల్యే ఊరేగింపు? ఏం జరిగిందంటే.?

Update: 2020-09-29 03:00 GMT
కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసిన వ్యవసాయ బిల్లులపై కర్ణాటక రైతులు భగ్గుమన్నారు. ఈరోజు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. అన్నదాతలంతా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే ఈ బంద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అన్నదాతలు కర్ణాటకలో చేస్తున్న ఈ బంద్ కు మొత్తం 108 సంఘాలు, సంస్థలు మద్దతు తెలుపడంతో భారీ ఆందోళనగా మారింది. కరోనా టైంలో ఇంత పెద్ద ఆందోళన దేశంలో ఇదే ప్రథమం కావడం గమనార్హం.

కాగా బెంగళూరుతోపాటు రాష్ట్రమంతటా బంద్, రైతుల నిరసనలతో రైతులు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం రైతుల ఆందోళనకు మద్దతుగా ముందుండి ఈ బంద్ ను విజయవంతం చేస్తున్నాయి.

ఈ ఆందోళనల్లో మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ ప్రత్యక్షమై హల్ చల్ చేశారు. ఈయన కర్ణాటకలో వింత వింత చేష్టలతో వార్తల్లో నిలుస్తుంటారు. మన రాయలసీమలో బంగి అనంతయ్య లాగా అన్న మాట.. కననడ చళవళి వాటల్ పార్టీ అధ్యక్షుడిగా వాటల్ నాగరాజుకు పేరుంది. ఈ యన మాజీ ఎమ్మెల్యే అన్ని పార్టీల నాయులతో సంబంధాలున్నాయి.

తాజాగా రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగిన వాటల్ నాగరాజ్ బలంగా ఉన్న ఒక గాడిద మీద రారాజు డ్రస్ వేసుకొని ఊరేగింపు చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఈయన గాడిదపై చేస్తున్న నిరసనను ఆపి కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News