డబ్బుల్లేక 30 కి.మీ.కూతురు మృతదేహాన్ని అలా..

Update: 2017-02-21 03:52 GMT
పాడు డబ్బు అందరి దగ్గరా ఉంటే ఏమవుతుంది. ఒక్కోళ్ల దగ్గర రాశులు.. రాశులు.. మరికొందరి దగ్గర చేతికి డబ్బులే లేని దుస్థితి. ఈ పేదరికం కారణంగా సాటి మనిషి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలిపే వైనమిది. చదివిన వెంటనే గుండె తరుక్కుపోయే ఈ విషాదంలోకి వెళితే.. కర్ణాటక లోని తమకూరు జిల్లా కోడిగేనహళ్లి వీరాపుర గ్రామానికి చెందిన రైతు కూలీ తిమ్మప్ప.. గౌరమ్మలకు పాతికేళ్ల కూతురుంది.

పుట్టుకతోనే ముగ చెవిటి అయినా కుమార్తెను ఉన్నంతలో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న ఆమెను.. ఆదివారం ఒక ఆర్ ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. ఆమె మరణించింది. దీంతో.. 108 అంబులెన్స్ లో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ.. వాహనం అందుబాటులో లేదు.

మరోవైపు చేతిలో డబ్బుల్లేవు. దీంతో.. 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి కూతురు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మోపెడ్ పై తీసుకెళ్లారు. మనిషి బతికి ఉన్నప్పుడే కాదు.. చచ్చిన తర్వాత కూడా డబ్బుల పుణ్యమా అని సరైన గౌరవం.. గుర్తింపు దక్కట్లేదే..?ఏమిటో ఈ పాడు బతుకులు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News