తన సొంత ఇలాకాలో పట్టు కోల్పోయిన సీఎల్పీ నేత జానారెడ్డి తిరిగి ఆదిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి విజయం సాధించారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ బాట పట్టించగలిగారు. నల్లగొండ జెడ్పీ వైస్ చైర్మెన్ కర్నాటి లింగారెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. నాలుగు నెలల కిందట 13 మంది ఎంపీటీసీలు - పది మంది సర్పంచులతో కలిసి టీఆర్ ఎస్ లో చేరిన ఆయన తిరిగి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు తొమ్మిది మంది ఎంపీటీసీలు - ఎనిమిది మంది సర్పంచులు తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
సీఎల్పీ నేత జానారెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కర్నాటి తెలిపారు. తాను కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ వీడాల్సి వచ్చిందని, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో అప్పులు తెచ్చిన రైతులు వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవ డంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్సీగా తనను గెలిపించిన విధంగానే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/