డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మళ్లీ విషమించింది. తాజాగా ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. గత నెల 21న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కరుణానిధి ఆరోగ్యం మెరుగవుతూ.. విషమిస్తూ వస్తోంది. దీంతో తమిళనాట ఆయన అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజాగా కావేరీ ఆస్పత్రి డాక్టర్లు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘కరుణానిధి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వయసు దృష్ట్యా శరీర భాగాల పనితీరు మందగిస్తోంది. మరో 24గంటల పాటు ఆయన చికిత్సకు స్పందిస్తారో లేదో వేచిచూడాలి’ అంటూ దిగ్ర్భాంతికర ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. దీంతో చెన్నైలో ఆందోళనక పరిస్థితులు నెలకొన్నాయి.
కరుణానిధి వయసు ప్రస్తుతం 94 ఏళ్లు.. వయోభారంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇన్నాళ్లు ఇంటివద్దే ఆయనకు చికిత్స అందేది. ఈనెల జూలై 21న బీపీ ఎక్కువ కావడంతో హుటాహుటిన చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం కరుణానిధి శరీరం వైద్యానికి సహకరించడం లేదని కావేరీ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాట విషాధ చాయలు అలుముకున్నాయి.