తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ చేరింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థి కాటేపల్లి జనార్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. రెండు రౌండ్లు మిగిలుండగానే కాటేపల్లి జనార్దన్ రెడ్డి విజయం ఖరారైంది. కాటేపల్లి జనార్ధన్ రెడ్డి విజయంతో టీఆర్ ఎస్ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల సందడి నెలకొంది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 19,632 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాటేపల్లికే ఆధిక్యం దక్కింది. ఆయనకు 7,640 ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థులుగా బరిలో నిలిచిన మాణిక్ రెడ్డికి 3,048 ఓట్లు - ఏవీఎన్ రెడ్డికి 3,091 ఓట్లు వచ్చాయి. హర్షవర్దన్ రెడ్డికి 2,482 ఓట్లు రాగా...భూపతిరెడ్డి 1714 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ లో కాటేపల్లికి 4,549 ఓట్ల మెజార్టీ వచ్చింది. అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆయన సత్తా చాటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/