పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికగా నిలిచింది. దీంతో పాటుగా ఆసక్తికరమైన కామెంట్లకు సైతం ఈ ప్రతిష్టాత్మక సదస్సు వేదిక అయింది. మహాభారతంలోని కౌరవులంతా మూలకణం (స్టెమ్ సెల్) ద్వారా జన్మించారని - వారంతా టెస్ట్ ట్యూబ్ బేబీలని - గైడెడ్ క్షిపణులకు సంబంధించిన విజ్ఞానం కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే భారత్ కు ఉందని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీ నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకు తగు ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
జలంధర్ లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీ నాగేశ్వర్ రావు ప్రసంగిస్తూ.. ఆంగ్ల పర్యావరణవేత్త చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం కంటే విష్ణుమూర్తి దశావతారాలు ఎంతో ప్రాచీనమైనవన్నారు. శత్రు సంహారం కోసం శ్రీరాముడు అస్ర్తాలను - శస్ర్తాలను ఉపయోగిస్తే.. విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారని - లక్ష్యాలను ఛేదించిన తర్వాత ఈ ఆయుధాలన్నీ వెనక్కి తిరిగి వచ్చేవని - దీన్నిబట్టి చూస్తే గైడెడ్ క్షిపణులు భారత్ కు కొత్త కాదని - ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇవి మనవద్ద ఉన్నట్టు స్పష్టమవుతున్నదని తెలిపారు.
రావణుడి వద్ద కేవలం పుష్పక విమానం మాత్రమే కాకుండా వేర్వేరు పరిమాణాలు - సామర్ధ్యాలతో కూడిన 24 రకాల విమానాలు ఉండేవని - ఈ విమానాలను ఆయన విభిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించేవారని - లంకలో అనేక విమానాశ్రయాలు కూడా ఉండేవని రామాయణం పేర్కొంటున్నదన్నారు. నీటి నుంచి జీవం ఉద్భవించినట్టు డార్విన్ చెప్పారని - విష్ణుమూర్తి మొదటి అవతారం కూడా మత్స్యావతారమేనని నాగేశ్వర్ రావు తెలిపారు.
కాగా, ఇండియన సైన్స్ కాంగ్రెస్ లో సీఎస్ ఐఆర్ - డీఆర్డీవో - ఐసీఏఆర్ - ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, రక్షణ రంగం తదితర విభాగాలకు చెందిన ఆవిష్కరణలు ప్రదర్శనలో కొలువుదీరాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు పలురాష్ర్టాలకు చెందిన యువ శాస్త్రవేత్తలు - పరిశోధక విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి సందేహం ఉన్న అంశాలపై చర్చించారు. వ్యవసాయ పరిశోధనలో భారత్ సాధించిన విజయాలు - భారత్ లో రోగాలు-నిరంతర సవాళ్లు - గట్ మైక్రోబియా అండ్ ప్రోబయాటిక్స్ అనే అంశాల మీద వివిధ ప్రాంగణాల్లో ప్లీనరీలు జరిగాయి. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక పరాక్రమాన్ని పొందుపరిచిన టైం క్యాప్సుల్ ను ముగ్గురు నోబుల్ పురస్కార గ్రహీతలు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో పూడ్చిపెట్టారు. ఈ టైం క్యాప్సుల్ ని వందేండ్ల తర్వాత అంటే 2119లో తిరిగి వెలికితీస్తారు.
Full View