గ్రేటర్ ఎన్నికలు మొదట అనుకున్న దానికంటే టఫ్ గా సాగుతోంది. షెడ్యూల్ కంటే కాస్త ముందుగా నిర్వహిస్తోన్న ఎన్నికల్లో అలవోకగా గెలుస్తామని భావించిన గులాబీ బాస్ అంచనాలకు భిన్నంగా సాగుతోంది ప్రస్తుత పరిస్థితి. ఎన్నికల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఇప్పుడు ప్రధానాంశంగా మారింది.గడిచిన ఆరేళ్లలో ఎప్పుడూ కనిపించని కొత్త మాట ఎన్నికల వేళ వినిపించటంతో..తెలంగాణ అగ్రనాయకత్వం అలెర్టు అయ్యింది. ఏదోలా గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్కాలన్న భావన వారిలో పెరిగింది.
దీనికి తగ్గట్లే.. విపరీతంగా శ్రమిస్తోంది గులాబీ దళం. కేసీఆర్ కుటుంబం విషయానికే వస్తే.. గ్రేటర్ బాధ్యతను పూర్తిగా తన భుజాల మీద పెట్టుకున్న మంత్రి కేటీఆర్.. కాలికి బలం కట్టుకొని మరీ తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు తనకు అప్పజెప్పిన డివిజన్లలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ కుమార్తె కమ్ ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కవిత సైతం తనకు కేటాయించిన డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు.
గడిచిన రెండు రోజులుగా ఆమె ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుమార్తె అన్న ట్యాగ్ ను పక్కన పెట్టేసి.. డివిజన్ గల్లీల్లో తిరుగుతూ.. పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. పానీ పూరీ బండి దగ్గర.. చాట్ తింటూ.. తన చుట్టూ ఉన్న నేతలకు చాట్ పెట్టిస్తున్న ఆమె.. కొందరి ఇళ్లల్లోకి వెళ్లి మరీ వారిచ్చే టీ తాగుతున్నారు. సీఎం కుమార్తె ఇంత సింఫుల్ గా ఉండటమా? అన్న భావన కలిగేలా చేయటంలో సక్సెస్ అవుతున్నారు. ప్రచారంలో పాస్ అయిన ఆమె.. ఓట్లు ఏమేరకు సాధిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.