పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు పవర్ స్టార్ పై పంచ్ ల మీద పంచ్ లతో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ కవిత సడెన్ గా రివర్స్ గేర్ లో పవన్ ని ప్రైజింగ్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి గతంలోకి వెళ్లిపోతే.. అటు పవన్.. ఇటు కవిత ఒకళ్ల మీద ఒకళ్లు పిచ్చిపిచ్చిగా సెటైర్లతో కుమ్మేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని మొదట్లో యుద్ధానికి తెరతీశారు కవిత. ఈ వ్యాఖ్యలపై తన స్టైల్ లో హైదరాబాద్ లో నిర్వహించిన తొలి సభలో పవన్ స్పందించారు. కవితను చెల్లెమ్మ అని సంబోధిస్తూనే.. నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించారు. జాగృతి పేరుతో స్థాపించిన సంస్థను అడ్డం పెట్టుకుని చేసిన వసూళ్లకు లెక్కలు చెప్పాలని హాట్ హాట్ విమర్శలు సంధించారు.
ఆ తర్వాత కవిత కూడా పవన్‌ను ఛాన్స్ వచ్చిన ప్రతిచోటా ఏకి పారేశారు. ఎన్నికలకు ముందు మేకప్ వేసుకుని ప్రజల్లోకి వచ్చి.. ఎన్నికలు అయిపోయాక పేకప్ చెప్పేసి తెరచాటై పోతారంటూ పవన్ పై సైటర్లు కుమ్మేశారు. అంతేకాదు, పవన్ ను బ్రహ్మానందంతో పోలుస్తూ.. మంచి సీరియస్ గా పాలిటిక్స్ నడుస్తున్న సమయంలో రెండు గంటలపాటు పవన్.. సినిమాల్లో బ్రహ్మానందం మాదిరిగా ఎంటరైపోయి.. ఫ్రీగా ఎంటర్ టైన్ చేస్తాడని అన్నారు. అలాంటి కవిత.. ఒక్కసారిగా కూల్ అయిపోయారు. కాకినాడ సభలో తెలంగాణ గురించి పవన్ చేసిన కామెంట్లు బాగున్నాయన్న ఆమె పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణకు హైకోర్టు లేదని, దీనిపై కేంద్రం వివక్ష ఎందుకు చూపిస్తోందో అర్ధం కావడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాది వాళ్లకి దక్షిణాది వాళ్లంటే చులకనని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సహా బీజేపీ తెలుగు రాష్ట్రాలంటే, తెలుగు వాళ్లంటే చులకనగా చేస్తున్నాయని మండిపడ్డారు. పనిలోపనిగా.. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటనను పేర్కొంటూ తెలంగాణ పాట పాడి వినిపించారు. దీంతో ఖుషీ అయి పోయిన కవిత.. కాకినాడ సభ అయి పోయిన అర్ధగంటలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ ను పొగిడేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చూసారా.. పాలిటిక్స్ ఎలా ఉంటాయో..!?