ప‌వ‌న్‌ ను క‌విత అస్స‌లు ప‌ట్టించుకోలేదుగా

Update: 2018-02-10 14:18 GMT
జనసేన పార్టీ అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్ అనూహ్య ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా..ఆమెను చెల్లెమ్మ అంటూ సంబోధించారు. విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌ లో కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. విభజన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్‌ కు మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ట్వీట్ణు ఎంపీ క‌విత లైట్ తీసుకున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. స‌హ‌జంగా కీల‌క‌మైన అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చిన‌పుడు వెంట‌నే విలేక‌రుల స‌మావేశం పెట్టిలేదంటే పత్రికా ప్రకటన అయినా విడుదల చేసి కవిత స్పంది స్తుంటారు. ఇటీవల ట్విట్టర్‌ లో కూడా ఎంపీ కవిత చురుకుగానే ఉన్నారు. నిన్నటికి నిన్న పార్లమెంటులో తాను చేసిన ప్రసంగం అంటూ ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే ఇంత చురుకుగా స్పందించే ఎంపీ కవిత...పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ కు మాత్రం రియాక్ట్‌ కాలేదు. శనివారం ఉదయం కేటీఆర్‌ ట్వీట్‌ చేసినప్పటికీ రాత్రి వరకు కూడా కవిత రియాక్ట్‌ కాకపోవడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఎంపీ కవిత స్పందించకపోవడం వెనుక కూడా కారణముందని పలువురు అంటున్నారు. గతంలో జనసేన పార్టీపై, పవన్‌ కళ్యాణ్‌ పై కవిత విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ స్పందించిన వెంటనే తాను కూడా రియాక్ట్‌ అయితే బాగోదనే ఉద్దేశంతోనే ఆమె ఆగిపోయి ఉంటారని అంటున్నారు.
Tags:    

Similar News