మ‌రి.. బ్ర‌ద‌ర్ పోటీ మాటేంది క‌విత‌?

Update: 2018-01-31 06:10 GMT
కొంత‌కాలంగా వినిపిస్తున్న వాద‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే మాట్లాడారు నిజామాబాద్ ఎంపీ క‌విత‌. ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత బ‌రిలోకి దిగుతార‌న్న ప్ర‌చారం తెలిసిందే. కీల‌క నేత‌లు పోటీ చేసే స్థానాలు దాదాపుగా మార‌వు. చాలా అరుదుగా మారుతుంటాయి.

ప్ర‌త్యేక సంద‌ర్భాల్లోనూ.. స్థానికంగా తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడు తాము రెగ్యుల‌ర్ గా పోటీ చేసే స్థానం నుంచి ప్ర‌ముఖులు పక్క‌కు త‌ప్పుకుంటారు. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగి విజ‌యం సాధించిన క‌విత‌.. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎంపీగా ఆమె ప‌ని తీరును త‌క్కువ చేసి చూడ‌లేం. రాష్ట్ర స్థాయి అంశాలు మొద‌లు జాతీయ‌.. అంత‌ర్జాతీయ అంశాల మీదా పార్ల‌మెంటు వేదిక మీద మాట్లాడి ప‌లువురి మ‌న్న‌న‌లు పొందారు.

ఢిల్లీలో తండ్రికి త‌గ్గ త‌న‌యురాలిగా పేరుప్ర‌ఖ్యాతులు పొందటంలో ఆమె స‌క్సెస్ అయ్యారు. ఇలాంటి వేళ‌.. ఎంపీగా ఆమె కొన‌సాగుతార‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. మ‌రో ప‌దేళ్ల పాటు తెలంగాణ‌ రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్ర‌భ‌కు తిరుగులేద‌న్న అంచ‌నాల‌తో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌కు త‌గ్గ‌ట్లే.. క‌విత ఆలోచ‌న‌లు మారిన‌ట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజ‌కీయాలకు దూరంగా ఢిల్లీ రాజ‌కీయాల వైపు వెళ్లే క‌న్నా.. తిరిగి రాష్ట్రానికి వ‌చ్చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే తండ్రి కేసీఆర్ తో త‌న అభిలాష‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతారు. ముద్దుల కూతురు అడిగిన త‌ర్వాత ఏ తండ్రి మాత్రం కాదంటారు? అందులోకి కూతుర్ని విప‌రీతంగా ప్రేమించే కేసీఆర్ లాంటి తండ్రి ముద్దుల కూతురు కోర్కెను కాద‌న‌లేరు. అందులోకి ఇప్పుడు వీస్తున్న గులాబీ గాలి నేప‌థ్యంలో ఆయ‌నేమ‌నుకుంటే అది జరిగిపోయే ప‌రిస్థితి. ఈ కార‌ణంతోనే కావ‌చ్చు.. క‌విత నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌న్న విష‌యాన్ని పార్టీయే నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతారు. ఒక‌వేళ‌.. తాను నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే బ‌రిలోకి దిగుతున్న‌ట్లైయితే.. అదే విష‌యాన్ని చెప్పేవార‌ని.. అసెంబ్లీ బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలోనే క‌విత నోటి నుంచి ఆ త‌ర‌హా మాట‌లు వ‌చ్చి ఉంటాయ‌ని చెబుతున్నారు. ఏమైనా.. త‌న పోటీ గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ రేగేలా క‌విత వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్ప‌లేని క‌విత‌క్క వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు స్పందిస్తూ.. మీరేనా.. మీ బ్ర‌ద‌ర్ కేటీఆర్ సైతం ఎక్క‌డ పోటీ చేయాల‌న్న‌ది పార్టీనే చెప్పాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News