ముగిసిన కవిత విచారణ.. 16న మరోసారి రావాలని నోటీసులు.. దిష్టితీసిన బీఆర్ఎస్ మహిళా నేతలు

Update: 2023-03-11 20:58 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. దాదాపు 8 గంటలకు పైగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ భోజన విరామ సమయం ఇచ్చారు. అనంతరం 5 గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు.

జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం.

కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్ మెంట్ ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ పిళ్లైతో కలిపి కవితనపు విచారించారు. ఆధారాలు ధ్వంసం చేయడం.. డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం.. హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై ఈడీ ఆరాతీసినట్టు సమాచారం.

అభియోగాలపై కవిత నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్న ఈడీ అధికారులు ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వచ్చే విచారణలో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.

విచారణ అనంతరం కవిత తుగ్లక్ రోడ్ లోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు.  కవితకు బీఆర్ఎస్ మహిళా దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆమెను ఆలింగనం చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News