అభిమానం కొండంత అయ్యింది. కోట్లాది మంది అభిమానిస్తున్న వేళ.. మిగిలిన వారికి భిన్నంగా ఉండాలంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలి. ఇదే ఆలోచనతో బుర్రకు పదును పెట్టారు తెలంగాణలోని ఒక గ్రామ సర్పంచ్. ఆయన తట్టిన ఐడియాకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోవటమే కాదు.. వెంటనే పనిలోకి దిగాడు. కట్ చేస్తే.. తాజాగా తొమ్మిది అడుగుల నిలువెత్తు కేసీఆర్ విగ్రహం తయారైంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంతకూ ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటారా? అక్కడికే వస్తున్నాం. జనగామ జిల్లాలోని చిల్పూరు మండల కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన ఐడియా వచ్చింది గ్రామ సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ కు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన కేసీఆర్ పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఉండేందుకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు.
అంత బాగుంది కానీ.. మరి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సాబ్ ఏమైనట్లు? అన్ని మరో సందేహం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహం మీద కేసీఆర్ రియాక్షన్ ఏమిటి? అన్నది ప్రశ్న. ఒకవేళ.. ఈ విగ్రహం విషయంలో పెద్దసారు కానీ చూసి చూడనట్లుగా ఉండి.. పట్టించుకోకపోతే రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా అభిమానాన్ని ప్రదర్శించుకోవటానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. మరి.. కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.