అంద‌రికీ టికెట్లు కుద‌ర‌వ్‌.. కూపీలాగేస్తున్న కేసీఆర్‌

Update: 2023-02-26 18:00 GMT
రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేం. ఎప్పుడు ఎలాగైనా మారే అవ‌కాశం ఉంటుంది. సో.. మా రుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా.. నాయ‌కులు కూడా వారి వారి వ్యూహాలు మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. తెలంగాణ రాజ‌కీయాలను ప‌రిశీలిస్తే.. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా అధికారం ద‌క్కించుకో వాల‌ని కేసీఆర్ చాలా ద్రుఢంగా నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం లేదు.

అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితి చాలా శ్ర‌మిస్తేనే త‌ప్ప ద‌క్క‌ని విజ‌యంగా ఉంది. గ‌తంలో లేని పార్టీలు.. విని పించ‌ని గ‌ళాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల  నాడి కూడా మారుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కూడా త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఇప్పుడు గ‌త రెండు రోజు లుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థులు ఉన్న నియో జ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టారు.

ఏయే నాయ‌కుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు?  ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తిపక్షం పుంజుకుంది?  ఏయే నేత దూకుడుగా ఉన్నారు?  ఎవరికి గెలిచేచాన్స్ ఉంది?  వంటి కీల‌క విష‌యాల‌ను కేసీఆర్ రాబ‌ట్టుకుంటున్నా రు. దీంతో ప్ర‌జాబ‌లం ఉండి.. గెలుపు గుర్రం ఎక్కుతారు.. అనుకునేవారికి మాత్ర‌మే ఈ ద‌ఫా టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏమాత్రం తేడా వ‌స్తుంద‌ని తెలిసినా.. వారిని ప‌క్క‌న పెడ‌తార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి  బీఆర్ ఎస్ ఆవిర్భావానికి ముందు జ‌రిగిన ప్లీన‌రీలో కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ``మా నాయ‌కుల‌కు టికెట్ల లొల్లి ప‌ట్టుకుంది. మాకిస్త‌రో ఇయ్య‌రో.. అని గుంజాట‌న ప‌డుతుండ్రు... అరె..ఎవ్వ‌రికి అన్యాయం చేసేది లేదు. అంద‌రికీ టికెట్లు ఇస్తం`` అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు మాత్రం కేసీఆర్‌..ఈ వ్యూహాన్ని అమ‌లు చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డికక్క‌డ నేత‌ల‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. దీంతో అంద‌రికీ టికెట్లు ద‌క్క‌వ‌నే స‌మాచారం.. వినిపిస్తోంది. మ‌రి ఎవ‌రికి ఇస్తారో చూడాలి.

Similar News