స్వల్ప అనారోగ్యంతో ఇద్దరు చంద్రళ్లు

Update: 2015-06-30 08:36 GMT
రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేరోజు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఉప్పు.. నిప్పులా ఉండే వీరిద్దరి మధ్య చాలానే పోలికలు ఉంటాయని పలువురు వీరి మధ్య పోలికలు తెస్తుంటారు.

ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకేసారి స్వల్ప అస్వస్థతకు గురి కావటం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతునొప్పితో బాధ పడుతున్నారు. దీంతో ఆయన కేర్‌కు వచ్చి వైద్యుల చేత పరీక్షలు చేయించుకొని వెళ్లిపోయారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప జ్వరానికి గురయ్యారు. దీంతో.. ఆయన ఈ రోజు హాజరు కావాల్సిన అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అయితే.. రేవంత్‌కు బెయిల్‌ లభించిందన్న వార్త రావటంతో ఆయన ఉన్నతాధికారులతో రహస్యంగా భేటీ కావటం గమనార్హం.

Tags:    

Similar News