ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు - చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. ఇందుకు ఢిల్లీ వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో జరిపే ఈ చర్చలు త్వరలో ఉండే అవకాశాలున్నాయని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నాయి.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ కరువు నెలకొన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులతో తాజాగా చర్చలు జరిపారు. మొదటి విడత కింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ - ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ - కర్నాటక సిఎం సిద్ధరామయ్యలతో వారి రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు - ప్రజలు ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు - కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహాయం - సహాయ - పునరావాస చర్యల గురించి చర్చించారు. తాగునీటి సరఫరా గురించి సమీక్షించటంతోపాటు పశుగ్రాసం లభ్యతపై కూడా వారు దృష్టి సారించారు. కరువు తీవ్రంగా ఉన్నందుకే మోదీ మొదట ఉత్తరప్రదేశ్ - మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులతో విడివిడిగా చర్చలు జరిపారని సమాచారం.
ఇదే తీరును కొనసాగిస్తూ కరువు నెలకొన్న ఇతర రాష్ట్రాల సీఎంలతో కూడా చర్చలు జరుపుతారని పీఎంఓ అధికారులు చెబుతున్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం - రాష్ట్రంతోపాటు స్థానిక సంస్థలు - స్వచ్ఛంద సంస్థలు - పౌరులు కలిసి పని చేయాలని ప్రధాని సూచించే అవకాశం ఉందని సమాచారం. జలాలను పకడ్బందీగా ఉపయోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. ప్రజలు ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలస పోకుండా చూసేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా ప్రధానమంత్రి సమావేశం సందర్భంగా కరవు సహాయక చర్యల కోసం వివిధ పద్దుల కింద ప్రత్యేకంగా సాయం చేయాలని తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.