సేమ్ సీన్ ఇన్ ఆంధ్రా...

Update: 2018-09-22 05:26 GMT
అవును...తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితి లాగే ఉంది ఆంధ్రప్రదేశ్‌ లో అధికార తెలుగుదేశం పరిస్థితి. రెండూ సేమ్ టు సేమ్. ఈయన ముందస్తుకు వెళ్లారు... ఆయన వెళ్లలేదు... మిగతాదంతా సేమ్ టు సేమ్. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంత్రప్తి ఉందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి తన పదవిని - అధికారాన్ని తొమ్మిది నెలలు ముందే వదులుకున్నారు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న అసంత్రప్తిని గ్రహించిన ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అదే పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు...ఆ రాష్ట్ర ఇంటిలిజెన్సీ నుంచి కూడా ఇలాంటి నివేదికలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందాయంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదని - ప్రజల్లోె తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంటిలిజెన్సీ వర్గాల నుంచి నివేదికలు వచ్చాయంటున్నారు. అయితే ముందస్తుకు వెళ్లకుండా ఈ తొమ్మిది నెలలూ అధికారంలో ఉండి చివరి వరకూ దాన్ని అనుభవించాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాధినేత తీసుకున్న నిర్ణయాన్ని తాను తీసుకోలేదని అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తుకు వెళ్లడానికి కారణం ఇక్కడ ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే అంటున్నారు.

అయితే ఆంధ‌్రప్రదేశ్‌ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండడం... ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో ముందస్తు నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారడానికి కారణం శాసనసభ్యుల పనితీరు - కొందరు నాయకుల ప్రవర్తనే కారణమని అంటున్నారు.దీన్ని ద్రష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి రోజు శాసనసభ్యులతో నేరుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చి అక్కడి లాగే మీరు వ్యవహరిస్తే భవిష్యత్ ఉండదని గట్టిగానే హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయంటూ శాసనసభ్యులను బెదిరించడం వెనుక కూడా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరగడం వల్ల వచ్చిందే అంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజలు విసుగెత్తారనే ఇంటిలిజెన్సీ నివేదికలు ఆయన్ని కలవర పెడుతున్నాయని పార్టీలోని సీనియర్లు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News