కేసీఆర్‌ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఆ జిల్లా నేత‌లు!

Update: 2019-08-04 04:35 GMT
తెలంగాణ‌లో మిగిలిన జిల్లాల సంగ‌తేమో గాని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత‌ల తీరు చూస్తుంటే సీఎం కేసీఆర్‌ కు కంప‌రం వ‌చ్చేస్తోంద‌ట‌. ఎన్నిసార్లు చెప్పినా విన‌కుండా ఎవ‌రికి వారు గ్రూపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుండ‌డంతో కేసీఆర్ ఈ జిల్లా నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌న్న ప్ర‌చారం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఖ‌మ్మం ఎర్ర జెండా కంచుకోట‌గా ఉండేది. ఇప్పుడు వారు అక్క‌డ ఉనికి కోల్పోయే ప‌రిస్థితి ఉంది. అక్క‌డ‌క్క‌డా టీడీపీ గ‌ట్టిగా పోటీ ఇచ్చేది. ఇప్పుడు దాని అడ్ర‌స్ కూడా గ‌ల్లంత‌యింది. ఇప్పుడు అక్క‌డ టీఆర్ ఎస్ బ‌లంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా ఆ రేంజ్‌ లో ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు రావ‌డం లేదు. ఇదే కేసీఆర్‌ ను ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జిల్లా మొత్తం మీద టీఆర్ ఎస్‌ కు ఒక్క ఖ‌మ్మం సీటు మాత్ర‌మే వ‌చ్చింది. ఇక మొన్న ఎంపీ ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసిక‌ట్టుగా కృషి చేయ‌డంతో ఎంపీగా నామా నాగేశ్వ‌ర‌రావు భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. రాజ‌కీయ విశ్లేష‌కుల లెక్క‌ల ప్ర‌కారం కూడా వ‌ర్గాల కుమ్ములాట వ‌ల్లే ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ ఎస్ దెబ్బ‌తిన్న‌ద‌ని చెపుతున్నారు. జిల్లాలో నేత‌లు ఎవ‌రి దారి వారిదే అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును జిల్లాలో కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటిమికి పార్టీలోనే కొంద‌రు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం అన్న‌ది తెలిసిందే. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు పాలేరులో ఆయ‌న‌పై గెలిచిన కందాళ ఉపేంద‌ర్‌ రెడ్డికి పొస‌గ‌డం లేదు. ఇక మాజీ ఎంపీ పొంగులేటితోనూ తుమ్మ‌ల‌కు తీవ్ర‌మైన గ్యాప్ ఉంది. ఇక స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌తోనూ తుమ్మ‌ల‌కు అంత‌త మాత్రంగానే స‌ఖ్య‌త ఉంది.

ఇక పొంగులేటికి కొత్త‌గూడెం మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావుకు ప‌డ‌డం లేదు. ఇక పార్టీ మారిన సీనియ‌ర్ నేత వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుకు జ‌ల‌గంతో స‌ఖ్య‌త లేదు. అటు పువ్వాడ అజ‌య్‌ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మ‌ధ్య ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ విబేధాలు ఉన్నాయి. ఖ‌మ్మం ఎమ్మెల్యే అజ‌య్ ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకోక‌పోయినా జిల్లా కేంద్రం కావ‌డంతో అక్క‌డ ప్ర‌తి ఒక్క‌రికి అనుచ‌ర‌గ‌ణం ఉంది. దీనిని అజ‌య్ స‌హించ‌లేక‌పోతున్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన లావుడ్యా రాములు నాయ‌క్‌ - సండ్ర వెంక‌ట వీర‌య్య‌ - బాణోత్ హ‌రిప్రియ‌ - వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు - ఉపేంద‌ర్‌ రెడ్డి - రేగా కాంతారావు పార్టీ మార‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాత‌ - కొత్త వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేయ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పినా నేత‌లు క‌ల‌వ‌క‌పోవ‌డంతో కావాల‌నే ఈ జిల్లాకు ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదంటున్నారు. కీల‌క ప్రాజెక్టుల విష‌యంలో కూడా శీత‌క‌న్ను వేయ‌డానికి కూడా ఈ జిల్లా నేత‌ల కుమ్మ‌లాట‌లే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా భ‌విష్య‌త్తులో ఖ‌మ్మం పార్టీలో కేసీఆర్ మార్క్ షాకింగ్ డెసిష‌న్లు ఉంటాయ‌ని తెలుస్తోంది.



Tags:    

Similar News