తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యయుత ఆందోళనల విషయంలో తన వైఖరి ఏంటో తేల్చిచెప్పారు. తనకో న్యాయం పరులకో న్యాయం అంటూ వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం ఇస్తూ...ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిందే..తాను చేస్తున్నానని వెల్లడించారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పై ధర్నాలు - నిరసనలు నిషేధించామని తేల్చిచెప్పారు. నిరసనకారుల పట్ల కఠినంగానే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ఉందని పరిమితికి లోబడి నిరసన తెలిపితే ఎవరైనా స్వీకరిస్తామని కేసీఆర్ తెలిపారు. `నిషేధాజ్ఞలు మేము తీసుకురాలేదు. చంద్రబాబు హయాంలో నిషేధాజ్ఞలు తీసుకువచ్చారు. అనుమతి లేకున్నా - కోర్టు వద్దన్నా ధర్నాలు చేస్తామంటే తాము అనుమతించాం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలుపాలి. బస్సు యాత్రలు - పాదయాత్రలు ఆపామా?` పరోక్షంగా ఇటు కాంగ్రెస్ ను - అటు జేఏసీ చైర్మన్ కోదండరాంను ప్రశ్నించారు. `బస్సు యాత్రలు చేసి తుస్సుమన్నారు. అనుమతి లేకున్నా ధర్నాలు - నిరసనలు చేస్తామనడం సరికాదు. ధర్నాలు నిర్వహించుకునేందుకు సరూర్ నగర్ లో అవకాశం ఇచ్చాం. అక్కడ ధర్నా చేస్తే ఏమౌతుందని ప్రశ్నించారు. మంచి పద్ధతిలో ధర్నాలు - ర్యాలీలు చేయాలని సూచించారు. లేని వాటిని ఊహించుకుని తాము ప్రజాస్వామ్యబద్ధంగా లేమని ప్రచారం చేయడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇక గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. `గవర్నర్ స్పీచ్ విషయంలో ప్రతిపక్ష సభ్యులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయమేమంటే.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే చదవాలి. గవర్నర్ స్పీచ్ కు కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతారు. ప్రభుత్వంలో జరిగే సత్యాలనే గవర్నర్ చదవి వినిపించారు. ప్రభుత్వం సాధించుకున్న లక్ష్యాలను.. నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ సభలో చదవి వినిపించారు. ఈ మధ్య కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘటలను బాధను కలిగిస్తున్నాయని తెలిపారు. సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు` అని సీఎం అన్నారు.