రాజకీయాల్లో చోటు చేసుకునే కీలక పరిణామాలు ఉత్తినే చోటు చేసుకోవు. అందునా.. అధికారం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే మోడీషాలు.. తెలంగాణలో తమకున్న సానుకూల వాతావరణాన్ని స్వయంగా పాడు చేసుకునే తెలివి తక్కువతనం వారికి ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు.. అంచనాలకు తగ్గట్లే జరగటమే దీనికి కారణం.
బండి స్పీడ్ ను తట్టుకోవటం కష్టమన్న ఉద్దేశంతో.. ఆయనకు బదులుగా నెమ్మదితనంతో ఉండే కిషన్ రెడ్డిని తీసుకొస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ చేతికి మరోసారి అధికారాన్ని అప్పగించేందుకు వీలుగా మోడీషాలు సహకారాన్ని అందించాలంటూ గులాబీ బాస్ వేడుకున్నారా? ఈ సాయానికి బదులుగా.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయాన ఎంపీ సీట్లతో 'రుణం' తీర్చుకుంటామన్న ఒప్పందం కుదిరిందా? అన్నదిప్పుడు ప్రశ్న.
ఎందుకంటే అటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కు కానీ ప్రత్యర్థి కాంగ్రెస్సే. బలహీనంగా ఉన్నంతవరకు ఓకే కానీ.. ఒక్కసారి పుంజుకొని.. తిరిగి అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ ను ఆపటం అంత తేలికైన విషయం కాదన్నది అటు మోడీషాలకు.. ఇటు కేసీఆర్ కు బాగానే తెలుసు.
ఈ కారణంతోనే తెర వెనుక ఒప్పందంతో కాంగ్రెస్ ను దెబ్బ తీసే పక్కా ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారని.. అందుకు తగ్గట్లే తాజాగా మార్పులు చేసి.. కిషన్ రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.
ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు. నిత్యం మోడీషాలపై విరుచుకుపడే కేటీఆర్.. హటాత్తుగా ఆ మధ్యన ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. అమెరికా పర్యటనలో మోడీ బిజీగా ఉన్న వేళలో.. కేంద్రమంత్రుల్ని కలిసిన సందర్భంలోనే అమిత్ షాతో భేటీ కావటం.. 'రాష్ట్ర సమస్య'ల మీద చర్చలు జరిపి.. ఆ తర్వాత బయటకు వచ్చి విమర్శలు చేయటం ద్వారా సీన్ ను శాయశక్తులా పండించిన వైనం తెలిసిందే.
కేటీఆర్ ఢిల్లీ టూర్ కు కొంతకాలం ముందు నుంచి బీజేపీ మీదా.. మోడీ సర్కారు మీద ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ పంచ్ లు వేయటం తగ్గించేయటం తెలిసిందే. అంతేకాదు.. గులాబీ బాస్ సొంత మీడియాలోనూ ఈ మధ్యన కేంద్రానికి.. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని వైఫల్యాలకు సంబంధించిన స్టోరీలు రాకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు గురి మొత్తం కాంగ్రెస్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీదనే ఉందన్న విషయాన్ని గర్తు చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిన మాటల్ని మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి చెప్పిన తర్వాత నుంచి సీన్ మొత్తం మారిపోయినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా గులాబీ కారును ఢీ కొనే క్రమంలో 'బండి' రెండు చక్రాలు దారుణంగా దెబ్బ తిన్నాయన్నది తాజా పరిణామాల్ని చూసినోళ్లంతా కామెంట్లు చేయటం గమనార్హం. అయితే.. ఈ వాదనలో నిజం మాటేమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇందులో నిజం లేకుంటే.. ఈ అనుమానం రానున్న రోజుల్లో గులాబీ బాస్ కు శాపంగా మారుతుందని చెప్పక తప్పదు.