అదృష్టమంటే కేసీఆర్ దే. ఆయన జాతకంలో ఏముందో కానీ.. ఏ ప్రాంతాన్ని అయితే ఆయన విమర్శిస్తారో.. తప్పు పడతారో.. ఆ ప్రాంతానికి చెందిన వారు మాత్రం ఆయన్ను అభిమనించటమే కాదు.. ఆరాధించే వైనం కనిపిస్తుంది. తెలుగు మాట్లాడే ప్రజల్ని రెండు రాష్ట్రాలుగా మార్చటంలో కేసీఆర్ కృషిని ఎవరూ తక్కువ చేసి చూపించలేరు. సామ..దాన.. దండోపాయాలన్న చందంగా.. ఏం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందో.. దాన్ని మాటలతో చెప్పటమే కాదు.. చేతలతో చేసి చూపించారు.
ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని తిట్టేసిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మాత్రం తెలుగు ప్రజలంటూ కలిపి మాట్లాడతారు. కలుపుకునేటట్లు ఒకట్రెండుసార్లు చేస్తే.. వేరు చేసి మాట్లాడటం మాత్రం నిత్యం చేస్తుంటారు. అంతలా వేరు చేసి చూసినా.. కేసీఆర్ అంటే.. ఆంధ్రాప్రాంత ప్రజలకు అదో క్రేజ్. అందుకు నిదర్శనంగా.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన పట్ల అభిమానాన్ని ప్రదర్శించటమే కాదు.. ఆయన చేసిన చిట్టి ప్రసంగానికి ఆంధ్రోళ్లు ఇచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
తన పుట్టిన రోజు నాడు తన నివాసంలో జరిపిన కార్యక్రమంలోనూ ఆంధ్రా ప్రాంతాలపై కేసీఆర్ ఫైర్ అయితే.. దానికి కొద్ది గంటల ముందు ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లోని తెనాలిలో ఆయన బర్త్ డే వేడుకల్ని నిర్వహించటం గమనార్హం. కేసీఆర్ అభిమాన సంఘం నేత ఖాదీర్ నేతృత్వంలో కొందరు కేసీఆర్ అభిమానులు.. కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంచుకోవటమే కాదు.. వృద్ధులకు అన్నదానం చేయటం గమనార్హం. ఏ ప్రాంతాన్ని అయితే విమర్శిస్తుంటారో.. ఏప్రాంతాన్నిఅయితే వేరు చేసి చూస్తారో.. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజలు కేసీఆర్ మీద చూపించే అభిమానం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. టీఆర్ఎస్ ఏపీ శాఖను మొదలు పెట్టేయొచ్చు అని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/