బీజేపోడు గిట్ల‌నే.. ఆర్నెల్లు అరిచి అలిసిపోత‌డు!

Update: 2019-07-12 04:59 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. న‌చ్చితే ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడే కేసీఆర్‌.. తేడా వ‌స్తే తీసి పారేయ‌ట‌మే కాదు.. పూచిక పుల్ల కంటే త‌క్కువ‌న్న రీతిలో రియాక్ట్ అవుతుంటారు. ఇటీవ‌ల కాలంలో బీజేపీ అగ్ర‌నేత‌లు మోడీషాల‌తో స‌రైన సంబంధాలు లేని వైనం తెలిసిందే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న మోడీషాలు.. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కేసీఆర్ ప‌లుమార్లు అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వ‌లేద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో విప‌క్ష‌మైన కాంగ్రెస్ ప‌ని ఖ‌ల్లాస్ అన్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తూ కేసీఆర్ ను అదే ప‌నిగా క‌మ‌ల‌నాథులు టార్గెట్ చేస్తున్నారు.

తాను ఒక‌సారి టార్గెట్ ఫిక్స్ అయితే..  పూర్తి అయ్యే వ‌ర‌కూ వ‌దిలిపెట్టిన మోడీషా క‌న్ను ఇప్పుడు తెలంగాణ మీద ప‌డింది.  కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకొని ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు ఘాటు వ్యాఖ్య‌లుచేస్తున్నారు. త‌మ‌పై ఈగ వాలినా ఒప్పుకోకుండా విరుచుకుప‌డే గులాబీ నేత‌లు.. బీజేపీ విష‌యంలో మాత్రం కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయ‌టం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ దూకుడుపై కేసీఆర్ వ‌ద్ద చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తెలంగాణ మీద బీజేపీ గురి పెట్టింద‌ని.. అధికార‌మే ల‌క్ష్యంగా ముందుకెళుతుందంటూ సాగుతున్న ప్ర‌చారంపై కేసీఆర్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద బీజేపీ మీద చేసిన వ్యాఖ్య‌లు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

‘‘బీజేపోడు గిట్లనే.. ఆరు నెలలు అరిచి - అరిచి అలిసిపోతడు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ నేత‌ల వ‌రుస విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అదే స‌మ‌యంలో వారు చేసే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల్ని మాత్రం స‌మ‌ర్థంగా తిప్పి కొట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ నేత‌లు చేసే విమ‌ర్శ‌లపై ఎట్టి ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండ‌కూడ‌ద‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చింది. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్న మాట‌లు మోడీషా ఇగోల‌ను ట‌చ్ చేసేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

బీజేపీలోని అన్ని స్థాయిల నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు.. త‌త్త‌ర బిత్త‌ర కావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వారు చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను.. విమ‌ర్శ‌ల్ని ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట కేసీఆర్ నోట వ‌చ్చిందంటున్నారు.  ఎంపీ ఎన్నిక‌ల్లో ఏదో నాలుగు సీట్లు రావ‌టంతో ఎగిరెగిరి ప‌డుతున్నార‌ని.. ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేద‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిందంటున్నారు.

బీజేపీ నేత‌ల్ని లైట్ తీసుకోవాల‌న్న‌ట్లుగా ఉన్న కేసీఆర్ మాట‌లు బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ఎక్క‌డో ట‌చ్ అయ్యేలా చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నం ప్ర‌జ‌ల్ని న‌మ్ముకుందాం.. చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయ‌ని వీలైనంత‌వ‌ర‌కు బీజేపీని లైట్ తీసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌ను పిచ్చ లైట్ తీసుకున్న‌ట్లుగా ఉన్న కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై క‌మ‌ల‌నాథులు ఏ తీరులో రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News