ఎన్ని సభలు పెట్టినా ఏదో ఒక కొత్త విషయం చెప్పి ఆకట్టుకోగల మాట చతురత కేసీఆర్ సొంతం. ఎప్పటికపుడు అప్‌డేట్ అవుతూ ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటూ ఉండే నేత ఆయన. ఈరోజు పలు సభల్లో మాట్లాడిన ఆయన తన తెలుగుదేశం కెరీర్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలపై నిబద్ధత లేదన్నారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. కొంతకాలం ఆయనతో పనిచేశాను. ఏం చేస్తాం అపుడు నా గాచారం బాలేదు కాబట్టి ఆయనతో పనిచేశాను... అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గీ చంద్రబాబు మాట గురించి ఏమని జెప్పాలె... ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టి ఎన్టీఆర్ ను మరోసారి చంపిండు. పైగా అదే సభలో కాంగ్రెస్‌నే ఓడించమని జెప్పిండు..అట్ల ఉంటది చంద్రబాబు తెలివి అన్నారు.
ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని ఆనాడు సీఎం కిరణ్ చెప్పారు. ఇపుడు ఏమైందో చూసినారు కదా. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. ఎవరో చెప్పారని మోసపోయి భయపడితే నష్టపోతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిణతితో ఆలోచించాలి. అపుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని అన్నారు.