శ‌భాష్‌ కేసీఆర్ స‌ర్‌.. ఆ నోటితోనే హోదాపైనా.. చెప్ప‌రాదే!!

Update: 2023-01-03 01:14 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి,  భార‌త రాష్ట్ర స‌మితి జాతీయ అధ్య‌క్షుడు కేసీఆర్‌.. తాజాగా ఏపీలోనూ విస్త‌రిం చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న తొలి అడుగు ఏపీలోనే వేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పేశారు.తాజాగా కొంద‌రిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సంద‌ర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందించారు.

"మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం" అని కేసీఆర్‌ ప్రకటించారు. కొన్ని వేల కుటుంబాలు ఆ సంస్థ‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నాయ‌ని చెప్పారు. ఒక‌వేళ‌.. విశాఖ ఉక్కును మోడీ అమ్మి తే.. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే.. విశాఖ ఉక్కును తిరిగి ప్రభుత్వరంగంలోకి తెస్తామని తెలిపారు.

నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జ‌రుగుతున్నాయ‌న్న కేసీఆర్‌.. చెన్నై వంటి నగరాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు.  దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరిపడా నీళ్లు దొరకటం లేదని.. ఇప్పటికీ కరెంట్‌ కోతలు ఉన్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నీరు, విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.

క‌ట్ చేస్తే.. ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. ముఖ్యంగా విశాఖ ఉక్కు విష‌యాన్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. అదే నోటితో ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించి ఉంటే బాగుండేద‌ని.. అంటున్నారు  ప‌రిశీల‌కులు. అంతేకాదు.. జ‌ల వివాదాను ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. అదే స‌మ‌యంలో ఏపీ-తెలంగాణ జ‌ల వివాదాల‌ను కూడా తాను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పి ఉంటే.. ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త మ‌రింత పెరిగేద‌ని చెబుతున్నారు.

ఏదేమైనా.. కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మారుతార‌నే న‌మ్మ‌కం ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌లిగితే.. ఖ‌చ్చితంగా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేక‌పోతే.. ఉత్తుత్తి ఊరేగింపులానే ఉంటుంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News