తెలంగాణ రాజకీయాల్లో కీలక పర్వానికి ముహుర్తం ఖరారైంది. ఊగిసలాటకు తెరదించుతూ ముందస్తుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. తన పదవికి గుడ్ బై చెప్పేందుకు కూడా కేసీఆర్ ముహూర్తాన్నే నమ్ముకున్నారు. అసెంబ్లీ రద్దు ముహూర్తాన్ని ఖరారుచేసుకున్న కేసీఆర్ వార్త టీఆర్ఎస్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 6న శ్రావణమాసం ఏకాదశి రోజున ఉదయం 9.30లోపే అసెంబ్లీ రద్దు ప్రక్రియ పూర్తిచేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభతో పాటుగా సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు వివిధ వర్గాలకు మేలు చేసేందుకు కీలక ప్రకటనలు చేశారు. ఈ కసరత్తు పూర్తయిన అనంతరం ఆయన ముందస్తుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 కాబట్టి ఈనెల 6వ తేదీన కేసిఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. తేదీతో పాటుగా సమయానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఉదయం 6గంటల 45 నిమిషాలకు ఈ తీర్మానానికి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయించుకునే పనిలో ఉన్నారు. అంటే (6+4+5 =15, 1+5 =6) ఇందులోనూ తన అదృష్ట సంఖ్య 6 వచ్చేలా కేసిఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్ తన సెంటిమెంట్‌ను మరోసారి నమ్ముకున్నట్లు చెప్తున్నారు.
కాగా, ఈ సమావేశం అనంతరం ఆయన మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు. హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. 50 రోజుల్లో వంద బహిరంగసభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పండితుల సూచన మేరకు శ్రావణ మాసంలో బహిరంగ సభ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర్రంలోని ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌ను తొలి సభకు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 7న సీఎం కేసీఆర్ హుస్నాబాద్ పర్యటనపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ...నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.