``దేశ రాజకీయాల్లో నాకంటే సీనియర్ ఎవరున్నారు? ప‌్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా...నాకంటే జూనియర్...దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాను. ఎందరినో ప్రధానులను, రాష్ట్ర పతులను చేశాను.`` ఈ మాటలు ఎవరివో...ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివి అనేది మీకు తెలుసు. స్వయం ప్రకటిత జాతీయ పార్టీ అయిన టీడీపీ (!) అధ్యక్షుల వారు చేయలేనిది తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించడం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ కు ఢిల్లీ లో కార్యాలయం నిర్మించుకోవడానికి వేయి గజాల స్థలం కేటాయించే అవకాశముంది. ఈ నేపథ్యం లో, వచ్చే నెలలో లేదంటే సంక్రాంతి పండగ నాటికి ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ ఎంపీలు ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలించారు. ఎంపీల తో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు పరిశీలన లో పాల్గొంటున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశముంది. తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్ పీపీ సమావేశానికి తొలి సారిగా హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఈ విషయాన్ని ప్రకటిస్తూ, పార్టీ అవసరాల కోసం ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే సందర్భం లో కేటీఆర్ తమ వైఖరిని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక మార్లు ప్రధాన మంత్రి సహా కేంద్రమంత్రులు, అధికారులకు అనేక అంశాల పై వినతి పత్రాలు ఇచ్చామని, అవి కార్యరూపం దాల్చడంలేదని అన్నారు. వీటన్నింటిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాగా, దేశం లో తనే గొప్ప నేత అని ప్రకటించుకున్న ఎంపీల ను గెలిపించుకోవడంలో....నాడు ఉమ్మడి రాష్ట్రానికి ఏకైక ప్రతినిధి గా నిలిచినట్లు ప్రకటించుకోవడం లో ముందున్న చంద్రబాబు...తెలుగు జాతి సత్తాను మాత్రం ఢిల్లీ వేదికగా చాటలేకపోయారని...విఫలం అయ్యారని...అదే పనిని చంద్రశేఖర్ రావు చేసి చూపిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.