జయజయహే.. అది తెలంగాణ రాష్ట్ర గీతం కాదు.. తేల్చేసిన కేసీఆర్

Update: 2021-03-17 12:00 GMT
ప్రభుత్వ పాఠశాలల్లో మొదలుకొని పలు సందర్భాల్లో పాడే జయజయహే గీతానికి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చిన నాటి నుంచి పాడుతున్న అందెశ్రీ రచించిన ఈ గీతం తెలంగాణ రాష్ట్ర గీతమా? కాదా? అన్న అంశంపై స్పష్టత లేదు.

ఇదిలా ఉంటే.. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్.. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా.. జయజయహే తెలంగాణ.. రాష్ట్ర అధికారిక గీతమా? అని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించలేదన్నారు.

రాష్ట్ర గీతాన్ని రాసుకున్నప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గీత రచయిత అందెశ్రీ..జయజయహే తెలంగాణ గీతాన్ని రాశారు. రఘునందన్ అడిగిన ప్రశ్నకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సమాధానం ఇవ్వటం గమనార్హం.


Tags:    

Similar News