2019కి తెలంగాణ ఎలా ఉంటుందో తెలుసా?

Update: 2015-11-29 04:31 GMT
కలల ప్రపంచాన్ని తరచూ ఆవిష్కరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా అలాంటి స్వప్నాన్ని ఒకటి ఆవిష్కరించారు. మూడేళ్ల తర్వాత.. అంటే 2019నాటికి తెలంగాణ ముఖ చిత్రం ఎలా ఉంటుందో తెలుసా? అంటూ ఒక పెద్ద కలను ఆవిష్కరించారు. ఈ స్వప్నంలో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు.. మద్దతు దారులు పలువురు టీఆర్ ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా 2019 నాటికి తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. పార్టీలో చేరే వారికి సరికొత్త ఉత్సాహాన్ని కల్పించారు.

2019 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో కేసీఆర్ మాటల్లోనే చెబితే..

= హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. ఇకపై దృష్టి పెడతా

= రానున్న రోజుల్లో జిల్లాల్లోనే ఎక్కువగా గడుపుతా

= 2019 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.1.60లక్షల కోట్లు ఉంటుంది

= వార్షిక వృద్ధి రేటు 12 శాతం నమోదు అవుతున్నది తెలంగాణ రాష్ట్రమే

= 2019 నాటికి వృద్ధి రేటు మరింత భారీగా పెంచేస్తాం

= ఉభయ గోదావరి జిల్లాల మాదిరి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తాం

= ఖమ్మం జిల్లా మొత్తానికి సాగునీరు అందిస్తాం

= రాజీవ్.. ఇందిరాసాగర్ లను ఏకం చేసి ఖమ్మం జిల్లాకు 5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం

= ఖమ్మం పట్టణానికి ఈ ఏడాది 2 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తాం

= బీసీలకు సహా రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తాం
Tags:    

Similar News