కేసీఆర్ దేనికి భయపడతారో తెలిసిపోయింది

Update: 2016-03-25 10:12 GMT
చావుకు సైతం వెరవకుండా మృత్యుముఖం వరకు వెళ్లి వచ్చిన మొండితనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా సరే రెఢీ అనటం ఆయనకు కొత్తేం కాదు. అలాంటి వ్యక్తి దేనికి వెరవరని అనుకుంటాం. కానీ.. కేసీఆర్ సైతం కొన్ని విషయాలకు భయపడటమే కాదు.. కాస్త జాగ్రత్తగా ఉంటారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

మంట పుట్టించే ఎండ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తారన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతంతో స్పష్టమైంది. తన వరంగల్ పర్యటన సందర్భంగా షెడ్యూల్ ప్రకారం తిరిగి వెళ్లాల్సిన సమయంలో.. హెలికాఫ్టర్ వద్దకు బయలుదేరిన కేసీఆర్.. కాసేపు ఆగిపోయారు. దాదాపు అరగంటకు పైగా ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎందుకిలా అన్న ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

దేనికి భయపడని కేసీఆర్.. ఎండ తీవ్రత విషయంలో ఆచితూచి ఉంటారని తెలుస్తోంది. వరంగల్ పర్యటన సందర్భంగా ఎండ తీవ్రత 41 డిగ్రీలు ఉండటం.. ఆ సమయంలో హెలికాఫ్టర్ లో బయలుదేరితే ఎండ కారణంగా తలనొప్పి వస్తే అవకాశం ఉండటంతో ఆయన తన ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు. హెలికాఫ్టర్ లో ఏసీ వేసి.. వాహనం మొత్తం చల్లదనంతో నిండటానికి అరగంట పడుతుందన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన.. హెలిప్యాడ్ కు వెళ్లని ఆయన.. కెప్టెన్ లక్ష్మీ కాంతరావు ఇంటికి వెళ్లి కాసేపు సేద తీరటం గమనార్హం. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ ఎండకు మాత్రం హడలిపోతారన్న మాట.
Tags:    

Similar News