స్నేహం అంటూనే మరీ ఇంత డ్యామేజ్ చేస్తారా? అంటూ కుతకుతలాడిపోతున్నారట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వస్తున్న కథనాలపై గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా కేసీఆర్ అనుకూల మీడియాలలో సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కథనాలు ప్రముఖంగా పబ్లిష్ అవుతున్నాయి.
దీనిపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకంతో తెలంగాణ సర్కారుకు భారీ ఇమేజ్ వస్తుందని.. మరింత బలపడుతుందన్న అంచనాలకు భిన్నంగా ఇసుక మాఫియా మీద వస్తున్న నెగిటివ్ కథనాలు విపక్షాలకు అస్త్రంగా మారటంపై కేసీఆర్ అండ్ కో గుర్రుగా ఉన్నారు. ఒకవైపు ఫ్రెండ్ షిప్ అంటూనే మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కథనాలు రావటంపై కేసీఆర్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది సరిపోనట్లు.. తాజాగా గవర్నర్ భేటీ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. గవర్నర్.. కాంగ్రెస్ నేతల మధ్య నడిచిన వాగ్వాదం.. దానికి తన అనుకూల మీడయా ఇచ్చిన కవరేజ్ మీదా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అనుకూల మీడియా అంటే.. అవసరమైనప్పుడు అండగా ఉండాలే కానీ.. ఏ మాత్రం ఛాన్స్ చిక్కినా ఇరికించేసేటట్లు ఉండటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే తన మనసులోని అసంతృప్తుల్ని తండ్రీకొడుకులు.. చెప్పాల్సిన వారికి చెప్పారని.. ఏమిటిలా? అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తండ్రీకొడుకుల ఆగ్రహాన్ని కూల్ చేసే పనిలో భాగంగా భజన కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా అనుకూల మీడియాతో గడిచిన కొన్నేళ్లుగా బండి లాగిస్తున్న కేసీఆర్ సర్కారుకు ఏ మాత్రం నెగిటివ్ కథనాల్ని భరించలేకపోతుందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ అండ్ కో ఆగ్రహం.. వరుస వినతుల విషయంలో అనుకూల మీడియా యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు కావాలని రాయకుననా.. ఏదైనా జరిగినప్పుడు సైతం టోన్ డౌన్ చేయాలన్న వినతి చేయటం ఏమిటన్న భావనలో అనుకూల మీడియా యాజమాన్యాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఇటీవల పబ్లిష్ అయిన కథనాలపై తండ్రీకొడుకులు హ్యాపీగా లేరన్న మాట బలంగా వినిపిస్తోంది.