వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తున్నారా? గత ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చండీయాగంలో కీలక పాత్ర పోషించారు. అలా అన్నీ తానై చూసుకోవడం వల్లే తన మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వైస్ చైర్మన్ గా కేబినెట్ హోదాలోని పోస్టులో నియమించారనే ప్రచారం కూడా సాగింది. అయితే అంతటి నమ్మినబంటుపై కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో బాల్కొండ ఎమ్మెల్యే - మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పై సీరియస్ అయ్యారు.
ఈమధ్య తాను చేయించిన సర్వేలో ప్రశాంత్ రెడ్డి పనితీరు బాగాలేదని రిపోర్ట్ రావడమే కేసీఆర్ మండిపాటుకు కారణం. నీ పనితీరుపై నియోజకవర్గ ప్రజల ఆమోదం డిసెంబర్ లో 62.20 % ఉంటే.. ఇప్పుడు 39.90 % కి పడిపోయింది. పదవి రాగానే అహంకారం-గర్వం-అహంభావం పెరగొద్దు. భగీరథ వైస్ ఛైర్మన్ కాగానే నీకు కొమ్ములు పెరిగినయ్. అప్పటినుండి నీ గ్రాఫ్ పడిపోయింది. ఎమ్మెల్యే గా ఉండి ఇసుక దందా చేస్తుంటివి. నీ పద్ధతి ఏం బాగోలేదు. ఇసుక వ్యాపారం చేస్తే ఏం విలువ ఉంటదయా? నువ్వు మళ్ల గెలుసుడు కష్టం" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారని సమాచారం. ఇలా సీఎం ఒక్క సారిగా ప్రశాంత్ రెడ్డి పై ఫైర్ కాగానే ముఖం మాడిపోయింది. అంతేకాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి చేపిచ్చిన సర్వేలో ఓడిపోయే ఎమ్మెల్యే ల లిస్ట్ లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నడు. మెదక్ జిల్లాలో ల్యాండ్ కబ్జా కేసుపై, బట్టాపూర్లో స్టోన్ క్రషర్ పెట్టిన విషయంపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని సీఎం ఫైర్ అయ్యారని తెలస్తోంది.
పూర్ పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేల లిస్ట్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ [39.40%] - ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి [48.80%] - కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ [54.90%] ఉన్నారు. ఇగ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి [61%], ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి [65.70%] - జుక్కల్ ఎమ్మెల్యే షిండే [69.30%] - నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ [69.30%] - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ [74.70%] పర్సెంటేజ్ వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/