ఏపీలో బలిజ మహిళా నేత మీద బీయారెస్ ఫోకస్

Update: 2023-02-13 13:30 GMT
ఏపీలో బీయారెస్ ని వీలైనంత మేరకు పట్టాలు ఎక్కించాలని తెలంగాణా సీఎం కేసీయార్ గట్టిగా ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో ఆయన పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు అయినా వారికి లేని సౌలభ్యం కేసీయార్ పెట్టిన కొత్త  జాతీయ పార్టీ  బీయారెస్ కి ఉంది అని అంటున్నారు. అదేలా అంటే ఆయన ఉమ్మడి ఏపీలో చిరకాలం పాటు రాజకీయం చేశారు. తెలుగుదేశంలో కొన్నాళ్ళు మంత్రిగా ఉన్నారు.

దాంతో ఆయనకు ఏపీలో కుల సమీకరణలు ఆ లెక్కలు పక్కాగా తెలుసు. అందుకే ఆయన ఏపీలో కోస్తా జిల్లాలలో కాపులకు పెద్ద పీట వేస్తున్నారు. ఏపీ బీయారెస్ ప్రెసిడెంట్ గా కాపు నేత అయిన తోట చంద్రశేఖర్ ని తెచ్చి పెట్టారు. అలాగే చాలా మంది కాపు నాయకులకు ఆయన పార్టీలో  మంచి స్థానం కల్పిస్తున్నారు. ఇపుడు ఆయన దృష్టి పూర్తిగా బలిజల మీద పడింది.

కోస్తాలో కాపులే రాయలసీమకు వచ్చేసరికి బలిజలుగా ఉంటారు. వారు సీమ జిల్లాలలో తమ పట్టుని పలుకుబడిని ఎప్పటికపుడు పెంచుకుంటూ వస్తున్నారు. రాజకీయంగా చూస్తే ప్రస్తుతం సీమ బలిజలు తెలుగుదేశం, జనసేనల మధ్య తిరుగుతున్నారు. ఇపుడు ఆ బలిజలను ఆకట్టుకోవడానికి బీయారెస్ కూడా పోటీలోకి వస్తోంది.

రాయలసీమకు కేంద్ర బిందువుగా ఉన్న తిరుపతి నుంచి బడా రాజకీయ కుటుంబానికే బీయారెస్ గేలం వేస్తోంది అని అంటున్నారు. చదలవాడ క్రిష్ణ మూర్తి సీనియర్ నేత. ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా కాలం ఉన్నారు. టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేశారు.

ఇక ఆయన్ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున తిరుపతి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచి ఆయన జనసేన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు ఆయన సతీమణి రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నరు. ఆమె జనసేన విధనాలను విమర్శిస్తున్నారు. అదే టైం లో కాపులకు టీడీపీ వైసీపీ అన్యాయం చేశాయని అంటున్నారు. ఇక కేసీయార్ వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే బాబు, జగన్ లాంటి ఏపీ నాయకుల వల్లనే పూర్తిగా నష్టం వచ్చిందని కూడా విమర్శిస్తున్నారు.

ఈ విధంగా ఆమె మాట్లాడం వెనక బీయారెస్ అనుకూల వైఖరి ఉందని అంటున్నారు. ఆమె మంచి వాగ్దాటి కలిగిన మహిళా నాయకురాలు కావడమే కాకుండా బలిజ కులస్థ్తులలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా ఉన్నారు. ఇక తిరుపతిలో చూస్తే బలిజ నేతగా సుగుణమ్మ టీడీపీలో ఉన్నారు.

ఆమెకు వయసు అయిపోవడంతో అల్లుడు రాజకీయాలోకి వస్తున్నారు. అయినా సుగుణమ్మ బలిజ సామాజికవర్గాన్ని లాగలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో యువ నాయకురాలిగా ఉన్నసుచతిర ముందుకు రావడంతో తిరుపతి రాజకీయ సమీకరణల్లో మార్పులు వస్తున్నాయని అంటున్నారు. తిరుపతిలో  బలిజలదే ఆధిపత్యం. దాంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీయారెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు బీయారెస్ నుంచి కూడా గ్రీన్ సింగల్ వచ్చిందని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన చదలవాడ కుటుంబం నుంచి మహిళ పోటీకి దిగితే అది బీయారెస్ కి ఎంతో మేలు చేసే వ్యవహారమే అవుతుందని అంటున్నారు. ఇక్కడ అధికార విపక్షాలకు పోటీ ఇచ్చే స్థాయిలోనే బీయారెస్ ఉంటుందని అంటున్నారు.

ఇక రాయలసీమ వైపు బీయారెస్ చూపు పెట్టడం బలిజల మీదనే ఫోకస్ చేయడంతో విపక్షాలు కూడా అలెర్ట్ అవుతున్నాయి. బలిజలు పెద్ద ఓటు బ్యాంక్ గా ఉన్న తెలుగుదేశం కూడా బీయారెస్ రాజకీయ పోకడలను గమనిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే సుచరిత కనుక బీయారెస్ లో చేరితే ఆ ప్రభావం సీమ జిల్లాలలో గట్టిగా ఉంటుందని, సీమలో బీయారెస్ కారు దూసుకుపోయేందుకు ఇది మార్గం అవుతుందన్నాంచానలు అయితే గట్టిగానే ఉన్నాయి. చూడాలి మరి సీమ బీయారెస్ బాధ్యతలు చదలవాడ ఫ్యామిలీ తీసుకుంటే ఏపీ రాజకీయ పార్టీలకు కొంత ఇబ్బందే అంటున్నారు.

Similar News