సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నొప్పింపక తానొవ్వక తరహాలో దూసుకుపోతున్నారు. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో తన ఓటు బ్యాంకు ను పదిల పరుచుకుంటూ పాత మిత్రులు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న కొత్త ప్రచారం బీజేపీ రాష్ట్ర నేతలను కలవరపెడుతోంది. టీఆర్ఎస్ ప్లాన్ బికి బీజేపీ కుదేలవుతోంది. కేసీఆర్ వ్యూహాత్మకంగా చేశాడా.? లేక కేంద్రంలోని బీజేపీ నేతలతో టై అప్ అయ్యాడో తెలియదు కానీ ప్లాన్ బి మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ ఏ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తో అవగాహన ఏర్పరుచుకొని ముందుకు సాగుతున్నారు మజ్లిస్ పోటీచేసే ఏడు స్థానాల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినా బలహీన అభ్యర్థులను ప్రకటించేసి తెలంగాణ వ్యాప్తంగా ఎంఐఎం మద్దతుతో ముస్లిం ఓట్లను టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తో దోస్తీ కడుతున్న కేసీఆర్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ప్లాన్ బి ఏంటంటే బీజేపీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో అవగాహనతో పోటీచేయడమేనట.. ప్రధాని మోడీతో కేసీఆర్ సాన్నిహిత్యం దృష్ట్యా వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసే అవకాశం ఉందట.. కొన్ని స్థానాలను బీజేపీకి ఇచ్చి మరికొన్ని స్థానాల్లో అవగాహనతో టీఆర్ఎస్ వెళ్తుందనే ప్రచారం మొదలైంది. ఇలా రాష్ట్ర అసెంబ్లీకి మజ్లిస్ తో.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో వెళుతూ కేసీఆర్ ఇద్దరు ఆగర్భ శత్రువులతోనూ ఎన్నికల బరిలో నిలుస్తున్నారనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటు మజ్లిస్ పోటీచేసే స్థానాలు.. ఇటు బీజేపీ నేతల స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో టీఆర్ఎస్ కు ఓటు వేసినా.. బీజేపీకి ఓటు వేసినట్టేననే ప్రచారం తెలంగాణలో మొదలైందట. దీనిపై బీజేపీ కాదు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదట.. ఈనెలలో అమిత్ షా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో దీనిపై క్లారిటీ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర నేతలు పట్టుదలతో ఉన్నారట..లేకపోతే బీజేపీని జనం నమ్మేలా కనిపించడం లేదట.. ఇలా టీఆర్ ఎస్ ప్లాన్ బి ఇప్పుడు బీజేపీని కలవరపెడుతోంది.